మేక్ ఇన్ ఇండియా నినాదం కాదు..
న్యూఢిల్లీ : 'మేక్ ఇన్ ఇండియా' పోర్టల్ గురువారమిక్కడ ప్రారంభం అయ్యింది. విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా 500 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. భారత్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల సందేహాలకు మేక్ ఇన్ ఇండియా పోర్టల్ ద్వారా 72 గంటల్లో సమాధానాలు ఇవ్వనుంది. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా నినాదం కాదు.. చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
భారత్‌ను మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా తయారు చేసేందుకు చిత్తుశుద్ధితో ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. పరిశ్రమలు ప్రారంభించేందుకు నిబంధనలు సరళతరం చేస్తామని వెల్లడించారు. కార్మిక చట్టాలకు సవరణలు తెస్తామని చెప్పారు. టాటా ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మాట్లాడుతూ తయారీ రంగంలో ఉపాధి కల్పనకు అవకాశాలు ఎక్కువన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకే టాటా గ్రూప్ సిద్ధంగా ఉందన్నారు.