'ఎన్నికలయ్యాక తలాక్‌పై కీలక నిర్ణయం' | Government may take major step to ban triple talaq after UP polls: Ravi Shankar Prasad | Sakshi
Sakshi News home page

'ఎన్నికలయ్యాక తలాక్‌పై కీలక నిర్ణయం'

Published Sun, Feb 5 2017 6:02 PM | Last Updated on Sat, Aug 25 2018 4:30 PM

'ఎన్నికలయ్యాక తలాక్‌పై కీలక నిర్ణయం' - Sakshi

'ఎన్నికలయ్యాక తలాక్‌పై కీలక నిర్ణయం'

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల తర్వాత త్రిపుల్‌ తలాక్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.

ఘజియాబాద్‌: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల తర్వాత త్రిపుల్‌ తలాక్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. ఆయన ఓ పత్రికా సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ తలాక్‌ వ్యవస్థ ముస్లిం మహిళల గౌరవానికి విలువ ఇవ్వడం లేదని, దానిని రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

'ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల తర్వాత తలాక్‌ విధానంపై కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది' అని ఆయన అన్నారు. సమాజంలో దుశ్చేష్టలకు ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మూడు పాయింట్లపై కేంద్రంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. ఈ విషయానికి మతానికి సంబంధం లేదని, ఇది ఒక మహిళ గౌరవానికి సంబంధించిన విషయం అని తేల్చి చెప్పారు. అన్ని వర్గాల విశ్వాసాలను, నమ్మకాలను కేంద్రం గౌరవిస్తుందని, ఆ పేరిట చేసే దుశ్చర్యలకు మాత్రం అనుమతించబోదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement