సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్‌సీ, ఎస్‌టీ ఉద్యోగులకు రిజర్వేషన్ అమలు దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఆర్డినెన్స్ రూపంలో ప్రమోషన్లలో కోటా అమలుకు సన్నాహాలు చేస్తోంది. ప్రమోషన్లలో ఈ వర్గాలకు రిజర్వేషన్ అమలుకు అవరోధంగా ఉన్న గతంలో న్యాయస్ధానం ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తుందని కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు.
కోటా కోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నా ముందుగా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని దళితుల అంశాలపై ఏర్పాటైన మంత్రుల బృందంలో సభ్యుడైన పాశ్వాన్ స్పష్టం చేశారు. ఎస్‌సీ, ఎస్‌టీల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న రెండు సుప్రీం కోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో పాశ్వాన్ ఈ వివరాలు వెల్లడించారు. ఎస్‌సీ, ఎస్‌టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లకు సుప్రీం సమ్మతించినా పలు షరతులు విధించడంతో కోటా మార్గదర్శకాలు అమలుకు నోచుకోలేకపోతున్నాయని పాశ్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment