ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ
న్యూఢిల్లీ: ఏకకాల ఎన్నికలకు కేంద్రం అనుకూలంగానే ఉందని, కానీ అందుకోసం లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరపబోమని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించే అవకాశాలను కూడా కొట్టిపారేశారు.
న్యూస్ 18 నెట్‌వర్క్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన శనివారం ఈ విషయాలు వెల్లడించారు. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ తదితరులు ఇటీవల ఏకకాల ఎన్నికలపై మాట్లాడటంతో..లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరుపుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాజ్యాంగాన్ని సవరించి, పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించే వరకు ఏకకాల ఎన్నికల నిర్వహణ అసాధ్యమని జైట్లీ వెల్లడించారు. ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో ఆసక్తి లేనట్లు వ్యవహరిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment