ఒక్క పండు.. రెండు కిలోలు!! | Gujarat's 2kg mangoes stump scientists | Sakshi
Sakshi News home page

ఒక్క పండు.. రెండు కిలోలు!!

Published Fri, Jun 6 2014 10:36 AM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM

ఒక్క పండు.. రెండు కిలోలు!! - Sakshi

ఒక్క పండు.. రెండు కిలోలు!!

అక్కడికెళ్లి కిలో మామిడిపళ్లు కావాలంటే.. ముందు పైకి, కిందకి చూస్తారు. తర్వాత మరీ తప్పదంటే సగం కాయ కోసి ఇస్తారు. అవును, ఎందుకంటే అక్కడ పండే మామిడి పండ్లు ఒక్కొక్కటి రెండేసి కేజీల బరువున్నాయి. మధ్య గుజరాత్లోని రైతులు, శాస్త్రవేత్తలు కలిసి ఈ విజయం సాధించారు. పైపెచ్చు ఇవేమీ జన్యుమార్పిడి చేసి పండించినవి కావు.. అచ్చమైన స్వదేశీ వెరైటీలు.  వడోదర జిల్లాలోని నరమదా నది ఒడ్డున గల షినోర్ గ్రామంలో ఇక్బాల్ ఖోఖర్ అనే రైతు తోటలోని చెట్లకు ఈ పెద్ద పెద్ద మామిడిపండ్లు పండాయి.

ఛోటా ఉదేపూర్లో ఇటీవల జరిగిన కృషి మహోత్సవంలో ఈ మామిడిపండ్లను ప్రదర్శించారు. పశు సంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ స్నేహా పటేల్ ఈ పండ్ల గొప్పదనాన్ని గుర్తించి, వీటికి ప్రాచుర్యం తెచ్చారు. రాజాపురి మామిడిపండ్లు సాధారణంగా పెద్దగా ఉంటాయని, కానీ వాటికంటే కూడా ఇవి నాలుగైదు రెట్లు పెద్దగా ఉన్నాయని ఆనంద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఉద్యానవన నిపుణుడు హేమంత్ పటేల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement