జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో కచ్డోరా ప్రాంతంలోని బ్యాంకు వద్ద శుక్రవారం దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో కచ్డోరా ప్రాంతంలోని బ్యాంకు వద్ద శుక్రవారం దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ సర్తాజ్ అమ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారైయ్యాడు. క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. స్థానిక జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ వద్ద దుండగుడు కాల్పులు జరపడంతో జనం పరుగులు తీశారు.