ముంబై: ముంబైలో ప్రసిద్ధ హజీ అలీ దర్గాలోని పవిత్ర ప్రాంతంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలన్న వాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఖురాన్ ప్రకారం నిషేధం మతవిశ్వాసాలకు సంబంధించినదిగా దర్గా బోర్డు నిరూపించగలిగేంతవరకూ ప్రవేశం కల్పించడానికి తమకు అభ్యంతరం లేదంది. ఈమేరకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ నిర్ణయాన్ని బాంబే హైకోర్టుకు విన్నవించారు.
హజీ అలీ ట్రస్ట్ దర్గాలోకి మహిళల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై కోర్టు ఆదేశం మేరకు ఆయన దీనిపై వివరణ ఇచ్చారు. విచారణ చేపట్టిన కోర్టు ... ఈ నెల 3న ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దర్గాలో పురుష మతపెద్ద సమాధి ఉందని, ఇస్లాం ప్రకారం మహిళలు పురుష మతపెద్దలను తాకరాదని దర్గా బోర్డు వాదించింది. అయితే, హజీ అలీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ దర్గాలో ఎవరినీ ఖననం చేయలేదని పిటిషనర్ రాజు మోరే కోర్టు దృష్టికి తెచ్చారు.
హజీ అలీ దర్గాలోకి మహిళలకు ప్రవేశం!
Published Wed, Feb 10 2016 1:27 AM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM
Advertisement
Advertisement