సాక్షి, ముంబై: అయోధ్య రామమందిర నిర్మాణం కోసం కరసేవకులు చేసిన పోరాటం వృథా కాలేదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్‌ఎన్‌ఎస్పీ) చీఫ్ రాజ్ ఠాక్రే అన్నారు. అయోధ్య భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. ఈ మేరకు రాజ్ ఠాక్రే ట్విటర్‌లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. బాలసాహెబ్ ఠాక్రే ఆలోచనలకు అనుగుణంగా నేడు తీర్పు వెలువడింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కొరకు కరసేవకులు చేసిన పోరాటం వృథా కాలేదు. నేటికి పూర్తి ఫలితం లభించింది. సంతోషకరమైన వాతావరణంలో రామమందిర నిర్మాణాన్ని చేపడుతాం. దీనితో పాటు త్వరలోనే రామరాజ్యాన్నీ స్థాపిస్తాం.’ అంటూ ఠాక్రే ట్వీట్ చేశారు.
కాగా అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని తేల్చిచెప్పింది.
MNS chief Raj Thackeray: I am happy today. All 'karsevaks' who gave sacrifices during the entire struggle..their sacrifice has not gone waste.Ram Temple must be constructed at the earliest. Along with Ram Temple, there should also be ‘Ram Rajya’ in the nation,that is my wish. pic.twitter.com/kUtg2cHTFN
— ANI (@ANI) November 9, 2019
Comments
Please login to add a commentAdd a comment