పోలీసులకు హర్లీ డేవిడ్ సన్ బైక్స్
కోల్‌కతా: హర్లీ డేవిడ్ సన్ బైకులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతగా క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. దానిపై మనసు పడినా ధర ఆకాశాన్నంటుతుంది. అలాంటి బైకులను పెట్రోలింగ్ కోసం మన పోలీసులు ఉపయోగిస్తున్నారు. అవును. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం హర్లీ డేవిడ్ సన్ స్ట్రీట్ 750 బైకులను కోల్‌కతా పోలీసుల కోసం కొనుగోలు చేసింది. ప్రస్తుతం కోల్‌కతా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను వాడుతున్నారు. కొత్తగా కొనుగోలు చేసిన హర్లీ డేవిడ్ సన్ బైకులు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు జత కలిశాయి.
కోల్‌కతా పోలీసులకు కొత్త సాంకేతికతను అందించడంలో కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందే ఉంటోంది. ఈ నెల 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తొలిసారి కోల్‌కతా పోలీసులు హర్లీ డేవిడ్ సన్ స్ట్రీట్ 750 బైకులపై పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ బైకులను కొనుగోలు చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెచ్చించిన మొత్తం చూస్తే కళ్లు తేలేయాల్సిందే.
ఒక్కో బైక్‌కు రూ.5.5 లక్షల చొప్పున మమత ప్రభుత్వం హర్లీ డేవిడ్ సన్‌కు చెల్లించింది. మామూలుగా హర్లీ డేవిడ్ సన్ స్ట్రీట్ 750 బైకు ధర రూ.4.9 లక్షలే. అయితే, పోలీసుల కోసం ప్రత్యేకమైన సదుపాయాలను కల్పించి వీటిని తయారు చేయించారు. దాంతో ధర తడిసి మోపిడైంది.