అస్వస్థతకు గురైన హర్యానా గవర్నర్... | Haryana Governor turns giddy at ID parade | Sakshi
Sakshi News home page

అస్వస్థతకు గురైన హర్యానా గవర్నర్...

Published Mon, Aug 15 2016 11:08 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

Haryana Governor turns giddy at ID parade

ఛండీఘర్ః 70వ స్వాతంత్ర వేడుకల సందర్భంలో హర్యానా గవర్నర్  కెప్టెన్ సింగ్ సోలంకి కొద్దిపాటి అస్వస్థతకు గురయ్యారు. ఇండిపెండెన్స్ డే పెరేడ్ జరుగుతుండగా సోలంకి సొమ్మసిల్లి పడిపోయినట్లు అధికారులు తెలిపారు.

సోలంకి పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే ఆయన అస్వస్థత చెందినట్లు చెప్పారు. అవసరమైతే ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తామని, ప్రస్తుతం సోలంకి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వెల్లడించారు. జెండా వందనానికి అనంతరం దేశాన్ని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగానికి సిద్ధమైన సందర్భంలో గవర్నర్.. పోడియంలో కొద్ది సెకన్ల పాటు కదలకుండా ఉండిపోవడంతో..  సిబ్బంది అలర్ట్ అయ్యి... సొమ్మసిల్లిన సోలంకిని కుర్చీలో కూర్చోబెట్టి, మంచినీళ్ళు అందించినట్లు అధికారులు వెల్లడించారు. .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement