ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం: భారీ వర్షాలతో కేరళలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇడుక్కి, కోజికోడ్, వయనాడ్, మలప్పురం, కన్నూర్ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. మణిమలలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఇద్దరు వ్యక్తులు నదిలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. కొల్లాంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో రెడ్‌అలర్ట్ ప్రకటించారు. గత వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా 2018 చివర్లో కేరళను వరదలు ముంచెత్తి వందలాదిమందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.
159కి చేరిన మృతుల సంఖ్య...
భారీ వర్షాలు నేపాల్ నుంచి వస్తున్న వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణుకిపోతున్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 159 మరణించారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. సహయాక బృందాలు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా బిహార్‌లోనూ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అక్కడ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు, వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దీనిని జాతీయ విపత్తుగా గుర్తించాలని బిహార్, అసోం ప్రభుత్వాలు కేంద్రాన్ని విఙ్ఞప్తి చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో పంజాబ్, హరియాణాల్లోని నదులు ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment