పనాజీ: ఇటీవల నాలుకకు శస్త్రచికిత్స చే యించుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ వ్యంగాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీ, తనపై విమర్శలు చేయడం వల్లే కేజ్రీవాల్ నాలుక పొడవైందని, ఇప్పుడు దాన్ని శస్త్రచికిత్సలో తగ్గించారని శనివారం అన్నారు. అయినా అనారోగ్యంతో సెలవులో ఉన్న కేజ్రీవాల్‌పై పరీకర్ సానుభూతి చూపారు. శనివారం గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.