తొలి గొరిల్లా వయస్సు ఎంతో తెలుసా?
అమెరికాలో ఓల్డెస్ట్ గొరిల్లాగా (ఎక్కువకాలం బతికిఉన్న) పేరొందిన కోలో 60 ఏట అడుగుపెట్టింది. ప్రతిష్టాత్మక కొలంబస్ జూలో ఉండే కోలో కి చాలా ఘనతలు ఉన్నాయి. కోలో ముగ్గురు పిల్లలకు తల్లి, 16 గొరిల్లాలకు అమ్మమ్మ, 12 గొరిల్లాలకు ముని అమ్మమ్మ( తాతమ్మ), మరో ముగ్గురికి ముత్తవ్వ. కోలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జూలలో పుట్టిన మొదటి గొరిల్లా.
కోలో ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు ఆపరేషన్ చేసి మాలిగ్నెంట్ ట్యూమర్ ను తొలగించారు. ప్రస్తుతం కోలో ఆరోగ్యంగా ఉందని వైద్యులు వెల్లడించారు. గురువారం 60 ఏట అడుగుపెట్టిన సందర్భంగా అనేక మంది కోలో ను చేసేందుకు జూ కు వచ్చారు. హ్యాపీ బర్త్ డే కోలో అంటూ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కోలో ఉండే ఎన్‌క్లోజర్ ను కలర్ ఫుల్ గా డెకరేట్ చేసి కేక్స్ తో నింపారు.