‘ఎలా ఎదుర్కొనేందుకైనా మేం సిద్ధం’ | I assure nation that Navy is fully combat ready to protect our maritime: Navy chief Sunil Lanba | Sakshi
Sakshi News home page

‘ఎలా ఎదుర్కొనేందుకైనా మేం సిద్ధం’

Published Sun, Dec 4 2016 10:11 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

‘ఎలా ఎదుర్కొనేందుకైనా మేం సిద్ధం’

‘ఎలా ఎదుర్కొనేందుకైనా మేం సిద్ధం’

న్యూఢిల్లీ: భారత నావికా దళం ఎప్పుడంటే అప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉందని నేవీ చీఫ్‌ సునీల్‌ లంబా అన్నారు. ఆదివారం నేవీ డే సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారత తీర ప్రాంతాల రక్షణకు తమ దళం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, ఎలాంటి శత్రువుల వ్యూహప్రతివ్యూహాలనైనాన సమర్థంగా ఎదుర్కొంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

దేశానికి తాము రక్షణ ఇవ్వగలమని తాము ఈ సందర్భంగా హామీ ఇస్తున్నామని అన్నారు. నేవీ డే సందర్భంగా త్రివిద దళాల చీఫ్‌లు ఒక చోట చేరారు. ఆర్మీ చీఫ్‌ దల్బీర్‌ సింగ్‌, నేవీ చీఫ్‌ సునీల్‌ లంబా, వైమానిక దళ చీఫ్‌ అరూప్‌ రహా ఢిల్లీలో అమర జవానుల జ్యోతికి నివాళులు అర్పించారు. అనంతరం ఢిల్లీలోని పాఠశాల చిన్నారులతో కలిసి ఈ వేడుకను జరుపుకున్నారు. చిన్నారులతో తమ అనుభవాలు సాహసాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సైనిక విన్యాసాలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement