చెన్నై: తాను యోగాను ఎప్పటి నుంచో చేస్తున్నానని డీఎంకే నేత, కరుణానిధి చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్ అన్నారు. తనలో సానూకూల దృక్ఫథానికి యోగానే కారణమని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ఫేస్బుక్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 'నేను చాలా ఏళ్లుగా యోగా చేస్తున్నాను. యోగా మన శరీరానికి, ఆలోచనకు స్థిరత్వం ఇస్తుందని నేను నమ్ముతాను.
అంతేకాకుండా ప్రతి ఒక్కరికీ పాజిటివ్ శక్తిని కూడా పెంపొందిస్తుంది' అని ఆయన యోగా విశిష్టతను తెలియజేశారు. ఏ ప్రభుత్వం పరిపాలించాలనుకున్నా దానికి ప్రజల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని చెప్పారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం అభినందనీయం అని చెప్పారు.
'నేను యోగా ఎప్పటి నుంచో చేస్తున్నా'
Published Sun, Jun 21 2015 6:30 PM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM
Advertisement
Advertisement