
'ఆమెకు థ్యాంక్స్ చెప్పేందుకు మాటలు రావట్లే..'
ఉత్తరాఖండ్: దేశంలో ఇటీవల అందరినీ ఆకర్షించిన రాష్ట్రం ఉత్తరాఖండ్. రాష్ట్రపతి పాలనను ఎదుర్కొని తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్ నేత హరీశ్ రావత్. బలపరీక్షను సమర్థంగా ఎదుర్కొని తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ వాది పార్టీ అధ్యక్షురాలు మాయవతి సహాయాన్ని ఆయన పదేపదే స్మరిస్తున్నారు. ఆమెకు ఎలా ధన్యవాదాలో తెలపాలో కూడా తనకు అర్ధం కావడం లేదని అన్నారు.
అలా చెప్పేందుకు కూడా తనకు మాటలు రావడం లేదన్నారు. ఆమెకు చాలా రుణపడి ఉన్నానని చెప్పారు. ఓ రకంగా బీఎస్పీ తనకు పెద్ద మొత్తంలో రిలీఫ్ ఇచ్చిందని, ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు వల్లే ప్రభుత్వం నిలబడిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో జరగనున్న ఎన్నికల్లో తాము కలిసి పనిచేస్తామని అన్నారు. మతశక్తులపై పోరాడే బీఎస్పీ తమ సిద్ధాంతానికి అనుకూలమైన పార్టీ అని.. ఆ పార్టీ సహాయంతో బీజేపీ ఓటు బ్యాంకును గల్లంతు చేస్తామని అన్నారు.