చైనాకు కౌంటర్‌.. రంగంలోకి సుఖోయ్‌! | IAF set to operate Sukhoi jets in Uttarakhand | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 19 2018 11:44 AM | Last Updated on Mon, Feb 19 2018 12:06 PM

IAF set to operate Sukhoi jets in Uttarakhand - Sakshi

డెహ్రాడూన్‌: సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేసేదిశగా భారత్ కదులుతోంది. డెహ్రాడూన్‌ జాలీ గ్రాంట్‌ ఎయిర్‌పోర్టులోని సివిల్‌ ఎయిర్‌ఫీల్డ్‌ను భారత వైమానిక దళం సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకువస్తోంది. అంతేకాకుండా ఇక్కడి నుంచి రెండు సుఖోయ్‌ యుద్ధ విమానాలు (ఎస్‌యూ-30ఎంకేఐ) రంగంలోకి దించబోతోంది.

సాధారణ ప్రక్రియలో భాగంగానే ఎయిర్‌ఫీల్డ్‌ను యాక్టివేట్‌ చేస్తున్నామని, ఇక్కడినుంచి సుఖోయ్‌ యుద్ధవిమానాలను రెండు రోజులపాటు (ఫిబ్రవరి 19, 20 తేదీల్లో) నడుపనున్నామని ఐఏఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు రోజుల్లో ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న అనంతరం రెండు యుద్ధ విమానాలు తిరిగి వైమానిక స్థావరం చేరుకుంటాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రాంతాల్లో ఇటీవల గగనతల ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యంలో పొరుగుదేశానికి దీటైన బదులు ఇచ్చేందుకు భారత్‌ ఈ చర్య చేపడుతున్నట్టు భావిస్తున్నారు. ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌తో ఉన్న దాదాపు 4వేల కిలోమీటర్ల సరిహద్దులో చైనా సైన్యాన్ని భారీ ఎత్తున మోహరించింది. చైనా సైన్యం మోహరించిన సరిహద్దుల్లో ఉత్తరాఖండ్‌ కూడా ఉంది. ఈ నేపథ్యంలో పొరుగుదేశానికి బలమైన సంకేతాలు ఇచ్చేందుకు భారత వైమానిక దళం తన యుద్ధవిమానాలను రంగంలోకి దింపుతుందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement