‘రాజ్‌నాథే కొనసాగి ఉంటే...’
న్యూఢిల్లీ: బీజేపీతో తెగదెంపులపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆ పార్టీ చీఫ్ అమిత్ షాపై పరోక్షంగా విమర్శలు సంధించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు బీజేపీ అధ్యక్షుడిగా ఉండాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరానని, ఆయనే బీజేపీ అధినేతగా ఉండి ఉంటే ఇరు పార్టీల మధ్య పొత్తు నిలిచేదని అన్నారు. ‘మోదీని పీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు రోజు రాజ్‌నాథ్ నాతో మాట్లాడారు. ఈ నిర్ణయానికి మద్దతివ్వాలని కోరారు. నేను మద్దతిచ్చాను.
ఆయన అందర్నీ కలసికట్టుగా ఉంచే వ్యక్తి’ అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం పై బీజేపీనేతలు సుష్మా, అద్వానీలతో మాట్లాడానని చెప్పారు. పొత్తు విచ్ఛిన్నం కావడం మంచిది కాదని అద్వానీ చెప్పారన్నారు. రాష్ట్రం లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు గురించి షా కొల్హాపూర్‌లో మాట్లాడిన తీరు.. వారికి శివసేనతో పొత్తు ఇష్టం లేదనడానికి నిదర్శనమన్నారు.