సాక్ష్యాలు ఉంటేనే వారిని అనుమానించాలి
న్యూఢిల్లీ: వరకట్న వేధింపుల ఆత్మహత్యల కేసుల్లో బాధితురాలిని అత్తింటి వారు కట్నం కోసం వేధించారనీ, ఆమె చావుకు వారి చిత్రహింసలే కారణమని తెలిపే సాక్ష్యాలుంటేనే అత్తింటి వారిని నిందితులుగా అనుమానించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పెళ్లరుున ఏడేళ్లలోపు కోడలు చనిపోతేనే వారిని ప్రాథమిక నిందితులుగా అనుమానించవచ్చంది. 1996 నాటి కేసులో కోర్టు పై ఉత్తర్వులిచ్చింది.