భారత అండర్ గ్రాడ్యుయేట్స్ అద్భుతసృష్టి | IIT kharagpur students makes formula 1 car | Sakshi
Sakshi News home page

భారత అండర్ గ్రాడ్యుయేట్స్ అద్భుతసృష్టి

Published Tue, Jul 26 2016 9:18 AM | Last Updated on Wed, Aug 1 2018 4:17 PM

భారత అండర్ గ్రాడ్యుయేట్స్ అద్భుతసృష్టి - Sakshi

భారత అండర్ గ్రాడ్యుయేట్స్ అద్భుతసృష్టి

ఫార్ములా1 కారును తయారుచేసిన ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులు
కోల్‌కతా: రష్యాలో జరిగే అంతర్జాతీయ పోటీలో పాల్గొనేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులు ఓ ఫార్ములా 1 రేసింగ్ కారును తయారు చేశారు. ఈ కారుకు ‘కే-3’గా నామకరణం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే కాంపిటీషన్‌లో 800 మంది విద్యార్థులతో కూడిన 30 బృందాలు పాల్గొంటాయి. ఇప్పటికే మూడు రేసింగ్ కార్లను తయారు చేసిన ఖరగ్‌పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఈసారి తక్కువ బరువు, ఎక్కువ మైలేజీ సామర్థ్యం కలిగిన కే-3ని తయారు చేశారు. ఈ కారు బరువు కేవలం 220 కిలోలు మాత్రమే.

గతంలో రూపొందించిన కార్లు కేవలం 2 కిలోమీటర్ల మైలేజీ మాత్రమే ఇచ్చేవని, అందుకే కార్బన్ ఫైబర్ ప్యానల్స్‌ను ఉపయోగించి ఈ తక్కువ బరువున్న కారును తయారు చేశామన్నారు. ఈ కారును తయారు చేసిన విద్యార్థులంతా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులే కావడం గమనార్హం. అయితే పూర్వ విద్యార్థుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఈ సరికొత్త కారును రూపొందించామని టీమ్ లీడర్ కేతన్ ముంధ్రా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement