'నేనేం విలన్‌ కాదు.. మీకు తెలిసింది కొంతే' | I'm No Villain, Ravindra Gaikwad, Of Air India Row, To Tell Parliament | Sakshi
Sakshi News home page

'నేనేం విలన్‌ కాదు.. మీకు తెలిసింది కొంతే'

Published Wed, Apr 5 2017 11:19 AM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM

'నేనేం విలన్‌ కాదు.. మీకు తెలిసింది కొంతే' - Sakshi

'నేనేం విలన్‌ కాదు.. మీకు తెలిసింది కొంతే'

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా మేనేజర్‌పై చేయిచేసుకొని ఆ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం ఎదుర్కొంటున్న శివసేన పార్టీ నేత, ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ త్వరలో వివరణ ఇచ్చుకోబోతున్నారు. వచ్చే పార్లమెంటులో అడుగుపెట్టి తన చర్యను సమర్థించుకునేందుకు సమాయత్తమవుతున్నారు. తాను చేయి చేసుకోవడానికి గల కారణాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను వరుసగా లోక్‌సభకు చెప్పే అవకాశం ఉందని అత్యంత సన్నిహిత వర్గాలు పీటీఐకి తెలిపాయి.

తొలుత లోక్‌సభకు హాజరైన తర్వాతే మీడియాను కలిసి మరోసారి వివరణ ఇస్తారని ఎంపీ సన్నిహితులు చెప్పారు. తానేమీ విలన్‌ కాదని, ఇప్పటి వరకు అందరికీ తెలిసింది ఒక వైపు ఉన్న కథేనని, తెలియాల్సింది చాలా ఉందని, అది సభలో చెబుతానని మీడియాతో అన్నారట. ఎయిర్‌ ఇండియా విమానంలోకి ఎక్కిన రవీంద్ర గైక్వాడ్‌ ఎయిర్‌ ఇండియా మేనేజర్‌తో గొడవపడి ఆయనను 25సార్లు చెప్పుతో కొట్టినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మేనేజర్‌ ఎయిర్‌ ఇండియాకు ఫిర్యాదు చేశాడు కూడా. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నాలుగుసార్లు ఆయనను విమానంలో ట్రావెల్‌ చేయకుండా సదరు సంస్థ బ్యాన్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement