Ravindra Gaikwad
-
ఆ ఎంపీ మళ్లీ విమానమెక్కారు!
ఎయిరిండియా ఉద్యోగి సుకుమార్‌ను చెప్పుతో కొట్టి.. దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం ఎదుర్కొన్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఎయిరిండియా విమానం ఎక్కారు. అది కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానం ఎక్కారు. అంతకుముందు ఆయన ఎయిరిండియా, ఇతర విమానయాన సంస్థలలోను ఎన్నిసార్లు టికెట్లు బుక్ చేసుకున్నా అవన్నీ ఎప్పటికప్పుడు రద్దయిపోయేవి. కానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయనను విమానం ఎక్కించుకోవాలని చెప్పడంతో ఎయిరిండియా సహా అన్ని సంస్థలూ సరేనన్నాయి. ఆ తర్వాత తొలిసారిగా ఆయన గురువారమే విమానం ఎక్కారు. ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడం వల్ల విమానాలు ఆలస్యమైతే వాళ్లకు రూ. 15 లక్షల వరకు జరిమానా విధించాలని ఎయిరిండియా ఇటీవల నిర్ణయించింది. -
విమాన ఆలస్యానికి కారణమైతే భారీ జరిమానా!
► ప్రతిపాదనల్ని సిద్ధం చేసిన ఎయిరిండియా ► గంటలోపురూ. 5 లక్షలు ► 1–2 గంటల మధ్య రూ. 10 లక్షలు ► 2 గంటలు దాటితే రూ. 15లక్షలు న్యూఢిల్లీ: విమాన ప్రయాణాల్లో అనవసర ఘర్షణలకు దిగి విమాన ప్రయాణం ఆలస్యం కావడానికి కారణమయ్యే ప్రయాణికులు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. వారిపై భారీగా జరిమానా విధించాలని ఎయిరిండియా యోచిస్తోంది. ఈ దిశగా ప్రతిపాదనల్ని కూడా సిద్ధం చేసింది. గొడవ వల్ల గంట ఆలస్యానికి రూ. 5 లక్షలు, గంట–రెండు గంటల మధ్య ఆలస్యానికి 10 లక్షలు, రెండు గంటలు దాటితే 15 లక్షలు జరిమానా విధించాలని ప్రతిపాదించినట్లు ఎయిరిండియా వర్గాలు చెప్పాయి. మరోవైపు దురుసుగా ప్రవర్తించే ప్రయాణికుల్ని అదుపుచేసేందుకు సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. విమానంలో ప్రయాణికులు గొడవ పడితే వెంటనే ఎయిరిండియా సీఎండీ లేదా ఇతర ఉన్నతాధికారులకు తెలపాలని, మీడియాకు మాత్రం వెల్లడించవద్దని సిబ్బందికి ఎయిరిండియా స్పష్టం చేయనుంది. అలాగే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చూడాలని, ఆస్తి నష్టం జరిగితే ఆ మొత్తాన్ని వీలైనంత త్వరగా ప్రయాణికుల నుంచి వసూలు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత నెల్లో ఎయిరిండియా ఉద్యోగిపై శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అనంతరం గైక్వాడ్‌పై ఎయిరిండియాతో పాటు, ఇతర విమానయాన సంస్థలు రెండు వారాల పాటు నిషేధం విధించాయి. నిషేధాన్ని నిరసిస్తూ పార్లమెంట్లో శివసేన పార్టీ సభ్యులు బీభత్సం సృష్టించారు. చివరకు క్షమాపణలు చెపుతూ విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు గైక్వాడ్ లేఖ రాయడంతో నిషేధం ఎత్తివేశారు. ఆ తర్వాత కూడా ఎయిరిండియా సిబ్బంది, ప్రయాణికుల మధ్య ఘర్షణ పూరిత ఘటనలు చోటుచేసుకున్నాయి. మరో ఘటనలో ఢిల్లీ నుంచి కోల్‌కతా వెళ్లే ఎయిరిండియా విమానంలో తృణమూల్ ఎంపీ డోలా సేన్, సిబ్బంది మధ్య గొడవతో ప్రయాణం ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా జరిమానాకు సిద్ధమవుతోంది. -
చట్టబద్ధమైన అహంకారమా?
విశ్లేషణ ‘చెప్పుతో 25 సార్లు కొట్టాన’ని గర్వంగా చెప్పుకున్న తర్వాత తాను ‘వినమ్రత’ కలిగిన వ్యక్తినని శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చెప్పిన మాటలను యథాతథంగా తీసుకోవడం ఎవరికైనా కష్టమే అవుతుంది. ఎయిర్‌లైన్స్ వ్యవహారంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గండం నుంచి బయటపడినట్లే. ఈ మరాఠా ఎంపీకి అనువుగా ఉండటం కోసం పుణె–ఢిల్లీ మార్గంలో బిజినెస్ క్లాస్ సీట్లు ఉన్న విమానాన్ని ఎయిరిండియా ప్రవేశపెట్టనున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఎంపీ గైక్వాడ్ తన వైఖరిని పూర్తిగా సమర్థించుకున్నట్లు కనిపించింది, అదే సమయంలో ఆయన ప్రత్యర్థులు మొదట్లో దృఢవైఖరిని అవలంబించినప్పటికీ ఆ తర్వాత మాత్రం లొంగుబాటు ప్రదర్శించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంమీద ఈ వివాదంలో శివసేన ఎంపీ గెలి చారు. పైగా ఈ మొత్తం ఉదంతంలో అవసరమైతే పార్టీ వైపు నుంచి న్యాయ సహాయం అందిస్తామని, కానీ భవిష్యత్తులో మాత్రం ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి సరిగా వ్యవహరించాలని సూచిస్తూ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే తమ పార్లమెంట్ సభ్యుడికి వత్తాసుగా నిలిచినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. రవీంద్ర గైక్వాడ్ ముందుగా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ ఎయిర్‌లైన్స్, విమానయాన మంత్రి గట్టిగా చేసిన డిమాండ్‌తో పోలిస్తే ఇది పట్టించుకోవాల్సిన పని లేనంత చిన్న విషయంగా అయిపోయింది. ఎయిర్‌లైన్స్ సీనియర్ ఉద్యోగిపై దాడికి సంబంధించి జరిగిన దానికి సారీ చెబుతూ శివసేన ఎంపీ చివరకు సభలో పశ్చాత్తాపం వ్యక్తపరిచారు. కానీ మీడియా మాత్రం దాన్ని క్షమాపణలాగా చూడనేలేదు. రాజకీయాధికార వర్గానికి చెందిన ప్రతిపక్షాలు లేదా వాటిలోని కొన్ని సెక్షన్లకు చెందిన వారు రవీంద్ర గైక్వాడ్ ప్రవర్తన చెడుగా ఉందని భావించినప్పటికీ, విమాన ప్రయాణం చేయడం నుంచి ఆయనను నిషేధించడం అనేది (సామాన్య ప్రయాణీకుడు ఇలా వ్యవహరించి ఉంటే ఇప్పటికే తను జైల్లో ఉండేవాడు) ఒక ఎంపీగా తన హక్కులను అతిక్రమించినట్లవుతుంది అనే ప్రాతిపదికన ఎంపీకి కల్పించాల్సిన హక్కులను భంగపరిచినట్లవుతుందన్న అభిప్రాయం కల్గించడానికి వీరు ప్రయత్నించారు. పైగా దీనికి సంబంధించి శివసేన పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెడతానని బెదిరించింది కూడా. కానీ, ఎంపీగా అతని ప్రత్యేకహక్కును అది ఉల్లంఘించినట్లేనా?. ఎయిరిండియా తన విమానాలలో ప్రయాణించకుండా ఆయనను తక్షణమే దూరం పెట్టేసినప్పుడు, ఒక ఎంపీని తన విధులు నిర్వర్తించకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నిస్తూ శివసేన.. ఇది అన్యాయమంటూ ఆక్రోశించింది. నిజమే.. చట్టసభలో కానీ, ఆయన ఏవైనా కమిటీలలో గానీ ఉన్నట్లయితే, ఒక ఎన్నికైన ప్రతినిధిగా తన విధులు తప్పక నెరవేర్చవలసే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆ నిషేధం తన పార్లమెంట్ విధులను నిర్వహించకుండా అడ్డగించడమే అవుతుంది. తన విధులు నిర్వర్తించకుండా శివసేన ఎంపీని అడ్డగించడం బహుశా తప్పే కావచ్చు. వాస్తవంగా కూడా ఏ ఎంపీని తన విధులను నిర్వర్తించడం నుంచి ఈ రూపంలో తప్పించకూడదు. ఇక్కడ ‘పనిచేయటం’, ‘విధులు’ అనే పదాలకే ప్రాధాన్యత ఉంది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ జరిగిన ఉదంతం అసౌకర్యాన్ని కలిగించిందంటూ చాలా జాగ్రత్తగా పదప్రయోగం చేశారు. అది హక్కుల ఉల్లంఘన అని చెప్పకుండా ఆమె చాలా జాగ్రత్త వహించారు. అయితే విస్తృతార్థంలో.. ఎంపీ చేయవలసిన విమాన ప్రయాణాలపై విమానయాన సంస్థ నిషేధం విధించడం అంటే పార్లమెంటుకు హాజరు కాకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం అని అర్థం కాదు. కానీ ఎయిరిండియా ఉద్యోగిని తాను తన చెప్పుతో పాతిక పర్యాయాలు కొట్టినట్లు టీవీ కెమెరాల ముందు శివసేన ఎంపీ స్వయంగా అంగీకరించారు కాబట్టి, అది హక్కులను అడ్డుకోవడంలాగా కాకుండా పూర్తిగా విభిన్నమైన ఘటనకు చెందిన ఒక పాయలాగా మారిపోయింది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తన చర్యను సమర్థించుకోవడమే కాదు (ఆ వీడియో ఫుటేజీని మీరు చూసినట్లయితే) తాను చేసిన పనికి ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. ఆ గర్వం కూడా కొట్టడం తన చట్టపరమైన హక్కు అనే భావన నుంచి వచ్చిన గర్వం. విమానంలో ఉన్న ప్రయాణీకుల భద్రత రీత్యా ఆ ఎంపీ భవిష్యత్ విమాన ప్రయాణంపై ఎయిరిండియా ఆంక్షలను కూడా విధించింది. పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు కూడా దాదాపుగా ఈ విషయాన్నే లోక్‌సభలో ప్రకటించారు. విమానయాన సిబ్బంది ఆగ్రహానికి కూడా ప్రాతిపదిక ఇదే. ‘చెప్పుతో 25 సార్లు కొట్టాన’ని గర్వంగా చెప్పుకున్న తర్వాత తాను ‘వినమ్రత’ కలిగిన వ్యక్తినని గైక్వాడ్ చెప్పిన మాటలను య«థాతథంగా తీసుకోవడం ఎవరికైనా కష్టమే అవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కొట్టొచ్చినట్లుగా కనపడుతున్న తన దుష్ప్రవర్తన ఫలితంగానే ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఈ ఉదంతంలో కాస్త మెట్టు దిగాల్సి వచ్చింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రివిలెజ్ కేసు ఉల్లంఘనకు సంబంధించిన నివేదికను పేర్కొంటూ, కౌల్ –షక్దర్ తమ ‘ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్’ అనే రచనలో.. ఇలాంటి తరహా ఉల్లంఘనలు, ‘ఇతర పౌరులకు మల్లే తనకూ వర్తించే సామాజిక విధుల నుంచి ఏ గౌరవ సభ్యుడినీ తప్పించలేవ‘ని చెప్పారు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com మహేష్ విజాపృకర్ -
విమానం వద్దని.. రైల్లోనే వెళ్లిన ఎంపీ
తాను విమానాలలో ఎక్కకుండా విధించిన నిషేధాన్ని విమానయాన సంస్థలు ఎత్తేసినా, ఉస్మానాబాద్ ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మాత్రం విమానం కాకుండా రైల్లోనే ప్రయాణిస్తున్నారు. తాజాగా ఆయన ముంబై నుంచి ఢిల్లీ వెళ్లేందుకు విమానం కాకుండా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలే ఎక్కారట. ఆయన ఆ రైలును ముంబై సెంట్రల్ స్టేషన్లో ఎక్కారో లేదా బోరివాలిలో ఎక్కారో తనకు తెలియదు గానీ, రైల్లోనే ఢిల్లీ వెళ్లారని.. పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు ఢిల్లీలోనే ఉంటారని ఎంపీ సన్నిహిత సహచరుడైన జితేంద్ర షిండే మీడియాకు చెప్పారు. పార్లమెంటులో తీవ్ర గందరగళం అనంతరం పౌర విమానయాన మంత్రిత్వశాఖ గైక్వాడ్ మీద నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా ఎయిరిండియాకు సూచించింది. దాంతో ఎయిరిండియాతో పాటు ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు సైతం ఆయనను తమ విమానాల్లోకి ఎక్కించుకోడానికి అభ్యంతరం ఏమీ లేదంటూ నిషేధాన్ని ఎత్తేశాయి. అయితే, ఆయన ముందుగానే రైల్లో టికెట్ రిజర్వు చేసుకున్నారని, ఆయనతో పాటు నలుగురైదుగురు సహాయకులు కూడా ఉన్నారని షిండే చెప్పారు. విమాన ప్రయాణంలో జరిగిన గొడవ మొత్తం ఇప్పుడు సర్దుమణిగిందని, ఆ గొడవ కారణంగా ఆయనేమీ విమాన ప్రయాణం మానుకోవడం లేదని అన్నారు. పుణె నుంచి గానీ, ముంబై నుంచి గానీ గైక్వాడ్ ఢిల్లీ వెళ్లే విమానాలు ఏవీ ఎక్కలేదని ఎయిరిండియా వర్గాలు కూడా నిర్ధారించాయి. -
ఆలస్యానికి ఎంపీ 15 లక్షల భారీ మూల్యం!
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మీద నిషేధాన్ని ఎయిరిండియాతో పాటు ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు సైతం ఎత్తివేసిన విషయం తెలిసిందే. అయితే నిషేధం మాత్రమే ఎత్తివేశాం కానీ, చట్టపరంగా పోరాటం చేస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది. తమ ఉద్యోగిపై దాడి చేసినందుకుగానూ అతడికి క్షమాపణ చెప్పకుండానే నిషేధం నుంచి బయటపడటంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మార్చి23న జరిగిన వివాదంలో ఎయిర్ క్రాఫ్ట్ (ఏఐ 852)ను 90 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చినందున అందుకు నష్టపరిహారంగా గైక్వాడ్ రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఎయిర్ ఇండియా స్పష్టంచేసింది. గైక్వాడ్ కారణంగానే సర్వీస్ ఆలస్యమైందని.. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకునేందుకు ఆ సంస్థ సన్నద్ధమైంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్ఐఏ)లో సభ్యత్వం ఉన్న ఇండిగో, స్పైస్ జెట్, గోఎయిర్, టాటా గ్రూపు ఎయిర్‌లైన్స్, విస్తారా, ఎయిర్ఏషియా ఇండియా తదితర సంస్థలు మార్చి 24వ తేదీ నుంచి ఎంపీ గైక్వాడ్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశాయి. ఎప్ఐఏలో సభ్యత్వం ఉన్న విమానయాన సంస్థలన్నీ గైక్వాడ్‌ను తమ విమానాల్లో అనుమతించాలని నిర్ణయించినట్లు ఎఫ్ఐఏ డైరెక్టర్ ఉజ్వల్ డే శనివారం తెలిపారు. ఎంపీ గైక్వాడ్ తమ సిబ్బందిని గౌరవించాలని, వాళ్లు ప్రతిరోజూ ఎంతగానో కష్టపడుతున్నారని.. విమాన ఆస్తులకు నష్టం కలిగించకూడదని ఆ సంస్థలు గైక్వాడ్ కు సూచించాయి. దాదాపు రెండు వారాల పాటు గైక్వాడ్ విమానయాన నిషేధం ఎదుర్కొన్న తర్వాత ప్రభుత్వ సూచన మేరకు ఆ నిషేధాన్ని ఎత్తేశాయి. రవీంద్ర గైక్వాడ్ క్షమాపణలు తెలిపారని, ఈ మేరకు లేఖ కూడా అందజేశారని.. గైక్వాడ్ ఇక మీదట సత్ప్రవర్తన కలిగి ఉంటానని హామీ కూడా ఇచ్చారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలపడంతో విమాన సంస్థలు శాంతించాయి. -
రవీంద్ర గైక్వాడ్ (శివసేన) రాయని డైరీ
పులి పులిలా ఉండాలి. పులిలా గాండ్రించాలి. పులి పళ్లికిలిస్తే మేకలు పేకముక్కలు పట్టుకొచ్చేస్తాయి.‘గురూ, ఒక ఆటేస్కుందాం రా’ అని నేల మీద తుండుగుడ్డ çపరుస్తాయి. మేకను ఎక్కడుంచాలో అక్కడ ఉంచితేనే అది పులి. మేక వచ్చి పులి పక్కన కూర్చున్నాక అదిక పులి కాదు. ఢిల్లీ నుంచి ముంబై వచ్చాక నేరుగా నేను నా గదిలోకి వెళ్లాను. అద్దంలో నా ముఖం చూసుకున్నాను. పులి చూపు లేదు. పులి మీసాలు లేవు. పులి కోరలు లేవు! పులి అద్దం చూసుకుంటే అద్దంలో పులే కదా కనిపించాలి. కానీ నాకు మేక కనిపిస్తోంది! వెనక్కి తిరిగి చూశాను. ఎవరెవరివో నీడలు. రెండు నీడలనైతే పోల్చుకున్నాను. ఒకటి అశోక్ గజపతిరాజుది. ఇంకొకటి ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌ది. పౌర విమానయాన శాఖ తన ట్రిప్పులన్నీ క్యాన్సిల్ చేసుకుని, నీడలా నన్ను వెంటాడడమే తన డ్యూటీగా పెట్టుకున్నట్లుంది. అద్దానికి మరింత దగ్గరగా వెళ్లి, దవడలు కదిలించి చూసుకున్నాను. మేక ఆకులు నములుతున్నట్లుగా ఉంది నా ముఖం. పార్లమెంటులో అపాలజీ లెటర్ ఇస్తున్నప్పుడే నాకు అనిపించింది.. నాలో మెల్లిమెల్లిగా ఏవో మార్పులు వస్తున్నాయని! అయినా.. పులి ‘సారీ’ చెప్పడం ఏంటి? పులి చేత ‘సారీ’ చెప్పించడం ఏమిటి? పులి ‘సారీ’ చెబితే జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. జీవ వైవిధ్యం దెబ్బతింటే ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉండదు. ఎంతలో ఉండాల్సింది అంతలో ఉండదు. మేక కూడా ‘మే..’ అని పరిసరాలు దద్దరిల్లేలా గాండ్రిస్తుంది. గెంతులేసుకుంటూ పోయే కుందేలు కూడా ఆగి, దగ్గరకొచ్చి ‘ఒక్క రైడ్ ప్లీజ్’ అని పులి వీపెక్కి కూర్చుంటుంది. పాపం.. పెద్దాయన బాల్ థాక్రే ఆత్మ ఎంతగా క్షోభించి ఉంటుందో.. నేను ‘సారీ’ చెప్పినప్పుడు! తలచుకుంటేనే రక్తం ఉడికిపోతోంది. మళ్లొకసారి వెళ్లి ఫట్‌ఫట్‌మని మరో పాతిక చెప్పుదెబ్బలు ఎయిర్‌పోర్ట్‌లో ఎవరు కనిపిస్తే వారిని కొట్టాలనిపిస్తోంది. ఢిల్లీలో రేపు డిన్నర్ పార్టీ! వెళ్లడం నాకు ఇష్టం లేదు. ఎన్డీయేని చేతుల్లో పెట్టుకుని, ఎయిర్ ఇండియాను చెప్పుచేతల్లో పెట్టుకోలేకపోయాను. ఏ ముఖం పెట్టుకుని డిన్నర్‌కు వెళ్లాలి? ఈ మేక ముఖమే కదా! ‘మీరు, మీ పార్టీ వాళ్లు డిన్నర్ పార్టీకి తప్పకుండా రావాలి’ అని అమిత్ షా.. ఉద్ధవ్ థాక్రేకి ఫోన్ చేసి మరీ ప్రత్యేకంగా ఆహ్వానించాడట. ఫోన్ చెయ్యడం ప్రత్యేకమా? వచ్చి పిలవడం ప్రత్యేకమా? ప్రణబ్ ముఖర్జీ తర్వాత ప్రెసిడెంట్ ఎవరో డిస్కస్ చెయ్యడానికట డిన్నర్ పార్టీ. శివసేన లేకుండా అక్కడ కొత్త ప్రెసిడెంట్ నిలుచోలేడు. శివసేన లేకుండా ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ నిలబడలేదు. అది తెలిసి కూడా.. ఎయిర్ ఇండియా చేత నాకు సారీ చెప్పించకుండా, నా చేతే ఎయిర్ ఇండియాకు సారీ చెప్పించారంటే.. బీజేపీ చూపు తగ్గిందా? శివసేన ఊపు తగ్గిందా?! మాధవ్ శింగరాజు -
ప్రైవేటు విమానాల్లో కూడా..
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మీద నిషేధాన్ని ఎయిరిండియా ఎత్తేయడంతో.. ప్రైవేటు విమానయాన సంస్థలు సైతం అదే బాటలో నడిచాయి. కావాలనుకుంటే తమ విమానాల్లో కూడా గైక్వాడ్ ప్రయాణం చేయొచ్చని తెలిపాయి. ఎంపీ చేసిన ప్రకటనతో సంతృప్తి చెందిన తర్వాత ఎయిర్ ఇండియా సంస్థ ఆయనను అనుమతించాలని నిర్ణయించడంతో, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో సభ్యత్వం ఉన్న విమానయాన సంస్థలు అన్నీ గైక్వాడ్‌ను తమ విమానాల్లో అనుమతించాలని నిర్ణయించినట్లు ఎఫ్ఐఏ డైరెక్టర్ ఉజ్వల్ డే తెలిపారు. అయితే, ఇదే సందర్భంలో తమ సిబ్బంది, ఆస్తులకు తగిన రక్షణ ఇవ్వాలని, వాళ్లు ప్రతిరోజూ ఎంతగానో కష్టపడుతున్నందున ఆ కష్టానికి తగిన గౌరవం ఇవ్వాలని.. ఆ మేరకు హామీ వచ్చిన తర్వాతే ఆయనకు విమాన ప్రయాణం చేసే అవకాశం ఇస్తున్నామని డే చెప్పారు. ఇండిగో, స్పైస్ జెట్, గోఎయిర్, టాటా గ్రూపు ఎయిర్‌లైన్స్, విస్తారా, ఎయిర్ఏషియా ఇండియా తదితర సంస్థలకు ఎఫ్ఐఏలో సభ్యత్వం ఉంది. ఇవన్నీ కూడా మార్చి 24వ తేదీ నుంచి గైక్వాడ్‌ను తమ విమానాల్లో ఎక్కించుకునేది లేదంటూ నిషేధం విధించాయి. ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 60 ఏళ్ల వయసున్న ఎయిరిండియా అధికారి ఒకరిని గైక్వాడ్ చెప్పుతో కొట్టి విమానం మెట్ల మీద నుంచి కిందకు తోసేందుకు ప్రయత్పినంచడంతో విమానయాన సంస్థలన్నీ ఆయనను నిషేధించాయి. ఆ తర్వాతి నుంచి ఎయిరిండియా సహా పలు సంస్థల విమానాలు ఎక్కడానికి గైక్వాడ్పలు రకాలుగా ప్రయత్నించారు గానీ, ప్రతిసారీ ఆయన టికెట్లు రద్దవుతూనే వచ్చాయి. రెండు వారాల పాటు నిషేధం విధించిన తర్వాత ప్రభుత్వ సూచన మేరకు ఆ నిషేధాన్ని ఎత్తేశాయి. రవీంద్ర గైక్వాడ్ క్షమాపణలు తెలిపారని, ఆయన ఇక మీదట సత్ప్రవర్తన కలిగి ఉంటానని హామీ కూడా ఇచ్చారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా సిబ్బందితోను, ఇతర ప్రయాణికులతోను అగౌరవంగా ప్రవర్తించే వ్యక్తులతో కూడిన ఒక ‘నో ఫ్లై జాబితా’ను సిద్ధం చేయాలని విమానయాన మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఈ మేరకు వచ్చేవారం ఒక ముసాయిదా సిద్ధం చేసి ప్రజల నుంచి కూడా దానిపై స్పందనలు తీసుకుంటారు. -
నేను సారీ చెప్పను గాక చెప్పను: ఎంపీ
కుక్కతోక వంకర.. ఎంత తీసినా రాదు అంటారు పెద్దలు. ఇప్పటికి దాదాపు ఏడెనిమిది సార్లు విమానం టికెట్లు రద్దు చేసినా ఇప్పటికీ శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌కు మాత్రం బుద్ధి మార లేదు. తాను చెప్పుతో కొట్టిన ఎయిరిండియా మేనేజర్ సుకుమార్‌కు క్షమాపణ చెప్పేది లేదని, పార్లమెంటుకు మాత్రం క్షమాపణ చెబుతానని అంటున్నారు. అంతేకాదు, తనను అవమానించిన సుకుమార్ పిచ్చోడని, అతడి మీద ఇలాంటì వి దాదాపు ఎనిమిది కేసులు నమోదై ఉన్నాయని అన్నారు. ఎయిరిండియా ఉద్యోగే ముందుగా తనతో గొడవ పడ్డాడని, అలాంటప్పుడు తాను ఎందుకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. తన చర్యల వల్ల పార్లమెంటు గౌరవానికి భంగం కలిగినట్లయితే పార్లమెంటుకు మాత్రమే క్షమాపణ చెబుతానన్నారు. తన మీద విధించిన ఫ్లయింగ్ బ్యాన్‌కు కూడా అర్థం లేదని, ఎందుకంటే విమానయాన సంస్థలకు ఏ ప్రయాణికుడినీ నిషేధించే హక్కు లేదని కూడా రవీంద్ర గైక్వాడ్ అన్నారు. తాను చెప్పిన విషయాలను ఎవరూ పట్టించుకోలేదని, ఒక ప్రజాప్రతినిధి విషయంలోనే ఎయిరిండియా ఇలా ప్రవర్తిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. పౌర విమానయాన మంత్రి అశోక గజపతి రాజు నుంచి విజ్ఞప్తి అందడంతో ఎయిరిండియా రవీంద్ర గైక్వాడ్ మీద నిషేధం ఎత్తేసిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఎయిరిండియాతో పాటు ఆరు ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా రవీంద్ర గైక్వాడ్ మీద నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
గైక్వాడ్‌కు మళ్లీ విమానయోగం
నిషేధం ఎత్తివేసిన ఎయిర్ ఇండియా ► పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలతో నిర్ణయం న్యూఢిల్లీ: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమాన ప్రయాణంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది తక్షణం అమల్లోకి వస్తుందని సంస్థ ప్రతినిధి చెప్పారు. ప్రైవేటు విమానయాన సంస్థలు దీనికి అనుగుణంగా నిర్ణయం తీసుకొంటాయని భావిస్తున్నామన్నారు. ఘటనపై గైక్వాడ్ పశ్చాత్తాపం వ్యక్తం చేసి, ఇలాంటివి పునరావృతం కావని హామీ ఇచ్చారు. గత నెల 23న ఎయిర్ ఇండియా సీనియర్ అధికారిని గైక్వాడ్ చెప్పుతో 25సార్లు కొట్టారు. దీనికి నిరసనగా ఎయిర్ ఇండియాతో పాటు ప్రైవేటు విమాన సంస్థలు విమానంలో ఆయన ప్రయాణించడాన్ని గతంలో నిషేధించాయి. బేషరతు క్షమాపణ చెబితేనే... మరోవైపు... విమాన అధికారిపై చేయిచేసుకున్న ఎంపీ గైక్వాడ్ బేషరుతుగా క్షమాపణ చెప్పే వరకూ ఆయన్ని విమానంలో ప్రయాణించబోనివ్వమని ఎయిర్ ఇండియా కేబిన్ క్రూ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్వనికి సంఘం లేఖ రాసింది. క్షమాపణ చెప్పకుండా గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేస్తే అది సంస్థ ఉద్యోగులతో పాటు భారతీయుల స్ఫూర్తిని దెబ్బతీస్తుందని సంఘం లేఖలో పేర్కొంది. దీంతోపాటు ఏఐకి చెందిన ‘ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్ గైక్వాడ్ బేషరతుగా క్షమాపణ చెప్పేవరకూ ఆయన్ను విమానాల్లో తిరగనివ్వమని హెచ్చరించింది. ఉపసంహరించుకోండి... గైక్వాడ్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని మంత్రిత్వ శాఖ ప్రైవేటు విమాన సంస్థలను కోరింది. అయితే దీనిపై ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్’ (ఎఫ్ఐఏ) అధికారికంగా ఇంకా ఎలాంటి నిర్ణయాన్నీ ప్రకటించలేదు. ఎఫ్ఐఏ నుంచి ఎలాంటి సమాచారం అందనంతవరకూ ఎంపీపై నిషేధం కొనసాగుతుందని ఎయిర్ ఏషియా ఇండియా ప్రతినిధి చెప్పారు. ఎయిరిండియా నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ గైక్వాడ్ శుక్రవారం రైలులో ముంబైకి పయనమయ్యారు. నిషేధానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు గైక్వాడ్‌కు చేరకపోవటంతో రైల్లో వెళ్తున్నారని ఎంపీ సన్నిహితులు తెలిపారు. -
ఎంపీ గైక్వాడ్‌పై నిషేధం ఎత్తేసిన ఎయిరిండియా
-
పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ గైక్వాడ్ లేఖ
న్యూఢిల్లీ: ఎయిరిండియా మేనేజర్‌పై దాడి చేసి.. విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. ఎయిరిండియా సిబ్బందిపై అనుచితంగా దాడి చేసిన ఘటనలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ గురువారం కేంద్ర విమానయాన శాఖమంత్రి అశోక్ గజపతిరాజుకు లేఖ రాశారు. దీంతో పాటు పార్లమెంట్ లో దాడి ఘటనపై కూడా తన లేఖలో ప్రస్తావించారు. కాగా ఎయిరిండియా సిబ్బందిపై దాడి వ్యవహారంపై ఆయన ఇవాళ పార్లమెంట్లో వివరణ ఇచ్చారు. తాను ఎయిరిండియాకు కాదని, పార్లమెంట్‌కు క్షమాపణ చెబుతానని అన్నారు. మరోవైపు ఆయనకు మద్దతుగా శివసేన ఎంపీలు లోక్‌సభలో హల్చల్ చేసి విమానాయాన మంత్రి అశోక్ గజపతిరాజును ఘెరావ్ చేసిన విషయం తెలిసిందే. కాగా గత నెల పుణె నుంచి ఢిల్లీ ప్రయాణించిన సందర్భంలో 60 ఏళ్ల ఎయిరిండియా ఉద్యోగిని ఎంపీ గైక్వాడ్ 25సార్లు చెప్పుతో కొట్టడం తీవ్ర దుమారం రేపింది. దీంతో విమానాయాన సంస్థలు ఆయన తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాయి. ఆయన పలుసార్లు టికెట్ బుక్ చేసుకున్నా.. వాటిని రద్దు చేసిన ఎయిర్‌లైన్స్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే దాడిపై పశ్చాత్తపం వ్యక్తం చేస్తూ గైక్వాడ్ లేఖ రాయడంతో దాడి వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలనే ఉద్దేశంతో కేంద్రం ఉంది. దీంతో ఆయనపై ఎయిర్‌లైన్స్ విధించిన నిషేధం ఎత్తివేయవచ్చని సమాచారం. మరోవైపు ఏప్రిల్ 10లోగా గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేయాలని, లేదంటే ఎన్డీయే సమావేశాలను తాము బహిష్కరిస్తామని శివసేన హెచ్చరించింది. -
ఆ దురుసు ఎంపీ నిషేధంపై కీలక అడుగు?
న్యూఢిల్లీ: ఎయిరిండియా మేనేజర్‌పై దాడి చేసి.. విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గురువారం తన వాదనను పార్లమెంటులో వినిపించారు. ఈ వ్యవహారంలో తాను పార్లమెంటుకు క్షమాపణ చెప్తాను కానీ, ఎయిరిండియా ఉద్యోగికి కాదని చెప్పుకొచ్చారు. ఆయనకు మద్దతుగా శివసేన ఎంపీలు లోక్‌సభలో హల్చల్ చేశారు. విమానాయాన మంత్రి అశోక్ గజపతిరాజును ఘెరావ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేసే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు విమానాయాన సంస్థలను ప్రభుత్వ వర్గాలు ఒప్పించే అవకాశముందని, సాయంత్రంలోగా ఆయనపై ఎయిర్‌లైన్స్ విధించిన నిషేధం ఎత్తివేయవచ్చునని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ దాడి వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలనే ఉద్దేశంతో ఈ మేరకు కీలక చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏప్రిల్ 10లోగా గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేయాలని, లేదంటే ఎన్డీయే సమావేశాలను తాము బహిష్కరిస్తామని శివసేన అల్టిమేటం జారీచేసింది. గత నెల పుణె నుంచి ఢిల్లీ ప్రయాణించిన సందర్భంలో 60 ఏళ్ల ఎయిరిండియా ఉద్యోగిని ఎంపీ గైక్వాడ్ 25సార్లు చెప్పుతో కొట్టడం తీవ్ర దుమారం రేపింది. దీంతో విమానాయాన సంస్థలు ఆయన తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాయి. ఆయన పలుసార్లు టికెట్ బుక్ చేసుకున్నా.. వాటిని రద్దు చేసిన ఎయిర్‌లైన్స్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. -
‘నువ్వేం ప్రధానివి కాదు కదా అన్నారు’
-
మహారాష్ట్ర విమానాశ్రయాల్లో భద్రత పెంపు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో అన్ని విమానాశ్రయాల్లో భద్రతను పెంచాలని ఎయిర్ ఇండియా యాజమాన్యం సూచించింది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ వివాదంపై పార్లమెంట్ లో గందరగోళం రేగడంతో ఎయిర్ ఇండియా అప్రమత్తమైంది. ముంబయి నుంచి ఎయిర్ ఇండియా విమానాలు ఎలా ఎగురుతాయో చూస్తామని శివసేన ఎంపీలు హెచ్చరించడంతో విమానాశ్రయాల్లో భద్రత పెంచాలని కోరింది. చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూచించారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, శివసేన ఎంపీలు చర్చలు జరిపి ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని కోరారు. ఈ అంశంపై లోక్ సభలో గురువారం శివసేన ఎంపీలు ఆందోళనకు దిగారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో లోక్ సభలో గందరగోళం రేగింది. -
క్షమాపణలు ఎవరు అడిగారు?
ఆయన ఎయిరిండియా ఉద్యోగి. వయసు దాదాపు 60 ఏళ్లు ఉంటాయి. అలాంటి వ్యక్తి పొరపాటున ఏదైనా మాట అన్నా.. మహా అయితే గట్టిగా మందలించొచ్చు. అంతేగానీ ఏకంగా 25 సార్లు చెప్పుతో కొడతారా? అలా కొట్టింది కూడా ఎవరో ఊరూ పేరూ లేని వ్యక్తి కాదు. లోక్‌సభ సభ్యుడు. తాను రాజకీయ నాయకుడిని అన్న గర్వమో ఏమో గానీ, శివసేన ఎంపీ రవీంద్ర విశ్వనాథ్ గైక్వాడ్ ఎయిరిండియాలో పనిచేసే సుకుమార్ అనే మేనేజర్‌ను చెప్పుతో కొట్టారు. తాను 25 సార్లు అతడిని కొట్టినట్లు మర్నాడు చెప్పారు కూడా. దాంతో ఒక్క ఎయిరిండియా మాత్రమే కాదు.. దాదాపు అన్ని విమానయాన సంస్థలూ ఆయనను బహిష్కరించాయి. తమ విమానాల్లో ఎక్కడానికి వీల్లేదంటూ ఆయన బుక్ చేసుకున్న ప్రతిసారీ టికెట్లు రద్దు చేసేశాయి. దాంతో ఒకసారి కారులో, మరోసారి రైల్లో ఇంకోసారి ఏకంగా చార్టర్డ్ విమానంలో ఆయన ప్రయాణించారు. అంతవరకు బాగానే ఉంది గానీ, లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు.. కావాలంటే పార్లమెంటుకు తాను క్షమాపణ చెబుతాను గానీ ఎయిరిండియాకు మాత్రం చెప్పబోనని అన్నారు. అసలు ఎయిరిండియానే కాదు, ఏ విమానయాన సంస్థ కూడా రవీంద్ర గైక్వాడ్‌ను క్షమాపణలు అడగనే లేదు. ఒకవేళ ఆయన క్షమాపణ చెబితే తాము మళ్లీ ఆయనను విమానం ఎక్కించుకోవాల్సి ఉంటుందని, అందువల్ల అసలు సారీ చెప్పనక్కర్లేదని కూడా ఎయిరిండియా ఉద్యోగులు స్పష్టం చేశారు. కేవలం ముంబై, ఢిల్లీలలోనే కాకుండా హైదరాబాద్ నుంచి బుక్ చేసుకున్న టికెట్లను కూడా రద్దు చేసిన ఎయిరిండియా.. అసలు తమ విమానాల్లో ఎక్కడా గైక్వాడ్‌ను ఎక్కించుకునేది లేదని స్పష్టం చేసింది. విమానయాన సంస్థల నియమ నిబంధనలలోనే ఇబ్బందికరంగా ప్రవర్తించే ప్రయాణికులను ఎక్కించుకోకుండా వాళ్లను నిరాకరించే అవకాశం తమకు ఉంటుందని స్పష్టం చేస్తారు. తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించేవారిని, సిబ్బంది పట్ల అనుచిత ప్రవర్తన కలిగి ఉండేవారిని చేతులకు బేడీలు వేసి బంధించే అధికారం కూడా విమానాల్లోని సిబ్బందికి ఉంటుంది. అలాంటప్పుడు తనను ఎక్కించుకున్నారా సరే.. లేకపోతే అసలు ముంబై నుంచి ఎయిరిండియా విమానాలు ఎలా ఎగురుతాయో చూస్తా అంటూ రౌడీలా బెదిరించడం ఎంతవరకు సబబు? అంతేకాదు, పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజును లోక్‌సభలో చుట్టుముట్టారు కూడా. అది కూడా స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేసిన తర్వాత!! ఇలాంటి చర్యల ద్వారా శివసేన ఎంపీలు.. ముఖ్యంగా రవీంద్ర గైక్వాడ్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకే తెలియాలి! -
నేను ఎలాంటి తప్పు చేయలేదు
-
‘నువ్వేం ప్రధానివి కాదు కదా అన్నారు’
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా సిబ్బందిపై చేయిచేసుకుని విమానయాన సంస్థల నుంచి నిషేధం ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పార్లమెంటులో తన వివరణ ఇచ్చారు. ముందుగా సభలో ఈ విషయంపై మాట్లాడేలా తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలని అన్నారు. ఎయిర్ ఇండియా సిబ్బంది విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, దోషిని కాదని చెప్పారు. మీడియానే తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిందన్నారు. అసలు తానెవరిపైనా చేయి చేసుకోలేదని, విమానంలో గందరగోళం సృష్టించానని చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలని, తానలా చేయలేదని వివరణ ఇచ్చారు. తన సీటును ఓ సీనియర్ సిటిజన్‌కు ఇచ్చానని, కానీ, ఎయిర్ ఇండియా వాళ్లు మాత్రం కొత్త కథ అల్లేశారని ఆరోపించారు. తనకు బిజినెస్ క్లాస్ టికెట్ ఉందని, అయినా ఎకానమీ క్లాస్‌లో కూర్చునేందుకు సిద్ధమయ్యానని తెలిపారు. ‘నువ్వేం ప్రధాని మోదీవి కాదు కదా, ఎంపీవీ అయితే మాకేమిటి అంటూ తిట్టారు. దీంతో నేను ఆ వ్యక్తిని విమానంలో నుంచి కిందికి దింపేశాను. అసలు నాపై హత్యా ప్రయత్నం ఆరోపణలు ఎలా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారో అర్ధం కావడం లేదు. నేను అంతగా చేసేందేమీ లేదు. విమానాల్లో ప్రయాణించడమనేది నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కును ఎయిర్ లైన్స్ సంస్థ ఎలా కాదంటుంది? ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకోవాల్సిందే. ఢిల్లీ పోలీసులు చాలా అతి చేశారు. నాపై హత్య ఆరోపణలు అసలు ఎందుకు పెట్టారు? నా కుటుంబానికి ఏడు టికెట్లు ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం. నేను ఎయిర్ ఇండియాపై గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. నాపై నమోదుచేసిన ఆరోపణలన్నింటిని తీసేయాలని హోమంత్రిని సభ ముఖంగా కోరుతున్నాను. సభలో ఉన్న సభ్యులంతా నా ఆవేదనను అర్ధం చేసుకొని నాకు మద్దతిస్తారని భావిస్తున్నాను. ఒక వేళ సభ సభ్యులు నా ప్రవర్తనతో బాధపడితే క్షమించండి. అంతేగానీ, నేను ఎయిర్ ఇండియాకు మాత్రం క్షమాపణలు చెప్పబోను’ అని అన్నారు. ఆయనకే మద్దతిస్తూ మరో శివసేన ఎంపీ అనంత్ గీతే మాట్లాడుతూ దర్యాప్తు జరగకుండానే ఒక ఎంపీపై ఎలా నిషేధం విధిస్తారని ప్రశ్నించారు. దీంతో ప్రజల భద్రతే తమకు ముఖ్యం అని, ఈ విషయంలో అస్సలు రాజీపడబోమంటూ పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు చెప్పడంతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. దీంతో లోక్‌సభ స్పీకర్ సభను వాయిదా వేశారు. ఆ వెంటనే శివసేన ఎంపీలు మంత్రి అశోక్ గజపతి రాజును చుట్టుముట్టారు. ఫలితంగా బీజేపీ, శివసేన ఎంపీల మధ్య వాడివేడి వాగ్భానాలు ఎదురయ్యాయి. శివసేన ఎంపీలయితే ముంబయి నుంచి ఎయిర్ ఇండియా విమానాలు ఎలా ఎగురుతాయో చూస్తామని హెచ్చరించారు. ఇదిలా కొనసాగుతుండగానే స్పీకర్ మహాజన్ ఈ విషయంపై ఏం చేద్దామని ప్రత్యేకంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏవియేషన్ మంత్రి అశోక్ గజపతి రాజుతో సమావేశం నిర్వహిస్తున్నారు. -
డబ్బుల్లేవని.. చార్టర్డ్ విమానంలో వెళ్లాడు
న్యూఢిల్లీ: ఎయిరిండియా సిబ్బందిపై చేయి చేసుకుని, ప్రముఖ విమానయాన సంస్థల నుంచి నిషేధం ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎట్టకేలకు విమానం ఎక్కారు. రెండు వారాలుగా పలుమార్లు విమానంలో ప్రయాణించేందుకు విఫలయత్నం చేసిన గైక్వాడ్.. డబ్బుల్లు లేవంటూనే చివరకు ఓ చార్టర్డ్ విమానంలో బుధవారం పుణె నుంచి ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు గాను ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు శివసేన ఏర్పాట్లు చేసింది. రెండు వారాల క్రితం విమానంలో సీటు విషయంపై గొడవపడి ఎయిరిండియా ఉద్యోగి సుకుమార్‌పై గైక్వాడ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. సుకుమార్‌ను చెప్పుతో కొట్టినట్టు ఆయన ఒప్పుకొన్నారు. సుకుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎయిరిండియా సహా పలు విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధించాయి. కాగా గైక్వాడ్ తప్పు చేసినట్టయితే ఆయనపై చర్యలు తీసుకోవాలని, విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించే అధికారం ఎవరికీ లేదని శివసేన సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. ఎయిరిండియా, స్పైస్ జెట్, ఇండిగో సహా పలు విమానయాన సంస్థల్లో గైక్వాడ్ టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన ఢిల్లీ వెళ్లడానికి శివసేన చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసింది. తనపై విమానయాన సంస్థలు నిషేధం విధించిన విషయాన్ని గైక్వాడ్ పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశముంది. -
‘నేను పేదోడ్ని.. చార్టర్ విమానాల స్థోమతెక్కడిది?’
న్యూఢిల్లీ: తాను చాలా పేదవాడినని, చార్టర్ విమానాల వ్యయాన్ని భరించే స్థోమత తనకు లేదని శివసేన పార్టీ వివాదాస్పద ఎంపీ రవీంద్ర గైక్వాడ్ అన్నారు. ఆయన గురువారం పార్లమెంటుకు హాజరవుతున్నారు. ఎయిర్ ఇండియా ఉద్యోగిపై చేయి చేసుకున్న నేపథ్యంలో విమానమే ఎక్కనివ్వకుండా ఆయనపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ అదే విషయంపై వివాదం రేగుతున్న నేపథ్యంలో ఆయన గురువారం పార్లమెంటుకు హాజరై లోక్‌సభలో ఈ విషయంపై సమాధానం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆయన తన తప్పే లేదని, అందరికీ తెలిసింది కొంతేనని, తెలియాల్సింది తాను గురువారం సభలో అనంతరం మీడియాలో చెబుతానని అన్నారు. ప్రస్తుతం విమానాల్లో నిషేధం ఉన్న ఆయన చార్టెడ్ ఫ్లైట్‌లో మహారాష్ట్ర నుంచి బయలుదేరి పార్లమెంటుకు హాజరవుతారని వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని మీడియా ఆయనను ప్రశ్నించగా ‘నేనొక పేదవాడిని. చార్టర్ విమానాన్ని భరించే స్థోమత నాకు లేదు’ అని చెప్పారు. -
'నేనేం విలన్ కాదు.. మీకు తెలిసింది కొంతే'
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా మేనేజర్‌పై చేయిచేసుకొని ఆ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం ఎదుర్కొంటున్న శివసేన పార్టీ నేత, ఎంపీ రవీంద్ర గైక్వాడ్ త్వరలో వివరణ ఇచ్చుకోబోతున్నారు. వచ్చే పార్లమెంటులో అడుగుపెట్టి తన చర్యను సమర్థించుకునేందుకు సమాయత్తమవుతున్నారు. తాను చేయి చేసుకోవడానికి గల కారణాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను వరుసగా లోక్‌సభకు చెప్పే అవకాశం ఉందని అత్యంత సన్నిహిత వర్గాలు పీటీఐకి తెలిపాయి. తొలుత లోక్‌సభకు హాజరైన తర్వాతే మీడియాను కలిసి మరోసారి వివరణ ఇస్తారని ఎంపీ సన్నిహితులు చెప్పారు. తానేమీ విలన్ కాదని, ఇప్పటి వరకు అందరికీ తెలిసింది ఒక వైపు ఉన్న కథేనని, తెలియాల్సింది చాలా ఉందని, అది సభలో చెబుతానని మీడియాతో అన్నారట. ఎయిర్ ఇండియా విమానంలోకి ఎక్కిన రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా మేనేజర్‌తో గొడవపడి ఆయనను 25సార్లు చెప్పుతో కొట్టినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మేనేజర్ ఎయిర్ ఇండియాకు ఫిర్యాదు చేశాడు కూడా. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నాలుగుసార్లు ఆయనను విమానంలో ట్రావెల్ చేయకుండా సదరు సంస్థ బ్యాన్ చేసింది. -
ఆయనకు స్పైస్‌జెట్ కూడా షాకిచ్చింది!
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌కు మరోసారి చేదు అనుభవం.. ఇప్పటికే ఐదుసార్లు విమానం ఎక్కేందుకు ప్రయత్నించి భంగపడిన గైక్వాడ్ తాజాగా ప్రైవేటు విమానంలోనూ తిరస్కారానికి గురయ్యారు. ఈసారి ఆయన ప్రైవేటు విమానాయాన సంస్థ స్పైస్‌జెట్‌లో ప్రయాణించేందుకు ప్రయత్నించారు. తక్కువ ధరకు అందుబాటులో ఉండే స్పైస్‌జెట్‌లో సోమవారం పుణె నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నారు. శనివారం రూ. 4,504 ధర కలిగిన టికెట్‌ను కొనేందుకు ఆయన ప్రయత్నించగా.. ప్రయాణికుడి పేరును 'రవీంద్ర గైక్వాడ్' అని చెప్పడంతోనే స్పైస్‌జెట్ వెంటనే టికెట్ బుకింగ్‌ను రద్దు చేసింది. ఈ విషయాన్ని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. తన విమానంలో 60 ఏళ్ల మేనేజర్‌పై దాడి చేసి దురుసుగా ప్రవర్తించిన గైక్వాడ్‌కు ప్రభుత్వ విమానాయాన సంస్థ ఎయిరిండియా ఇప్పటికే పలుమార్లు షాక్ ఇచ్చింది. ఎంపీ గైక్వాడ్ ఐదుసార్లు ఎయిరిండియా టికెట్ బుక్ చేసేందుకు ప్రయత్నించగా.. అన్నిసార్లు నిరాకరించింది. విమానంలో ప్రయాణించేందుకు అనుమతించకపోవడంతో ఆయన ఇప్పటికే రైలులో, కారులో ప్రయాణాలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఫ్లైట్ ఎక్కడానికి ఏడుసార్లు విఫలయత్నం!
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఉద్యోగిపై చెప్పుతో దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. విమానయాన సంస్థలు తనపై నిషేధం విధించడంతో విమానంలో ప్రయాణించేందుకు ఆయన విఫలయత్నం చేస్తున్నారు. ఏడు రోజుల్లో ఏడుసార్లు ప్రయత్నించి ఆయన భంగపడ్డారు. ఈనెల 28 నుంచి ఐదుసార్లు విమానంలో ఢిల్లీ వచ్చేందుకు ఆయన చేసిన యత్నాలు ఫలించలేదు. మూడు సార్లు టిక్కెట్లు కొనేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయన కొనుగోలు చేసిన టిక్కెట్లను రెండుసార్లు ఎయిరిండియా రద్దు చేసింది. రవీంద్ర గైక్వాడ్ పేరు గుర్తించగానే ఎయిరిండియా టిక్కెట్లు కొనుగోలు చేయకుండా చేస్తోంది. ఒకవేళ టిక్కెట్లు దక్కించుకున్నా రద్దు చేస్తోంది. గత శుక్రవారం(మార్చి 24) ఢిల్లీ నుంచి పుణెకు ఆయన బుక్ చేసుకున్న రెండు టిక్కెట్లను ఎయిరిండియా క్యాన్సిల్ చేసింది. ఈ నెల 24 నుంచి 30 వరకు మొత్తం ఏడుసార్లు ఆయన విఫలయత్నాలు చేశారు. రవీంద్ర గైక్వాడ్ పేరును నిషేధ జాబితాలో పెట్టినందున టిక్కెట్లు తీసుకోకుండా నిలువరిస్తున్నామని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు. -
విమానకంపెనీలు గూండాల్లా ప్రవర్తిస్తున్నాయ్!
ఉగ్రవాదులకు అనుమతిచ్చి.. సామాన్యులకు తిరస్కారామా? న్యూఢిల్లీ: విమానాయాన కంపెనీలు గూండాల్లా వ్యవహరిస్తున్నాయంటూ శివసేన తీవ్రంగా విరుచుకుపడింది. ఉగ్రవాదులను తమ విమానాల్లో ఎక్కించుకోవడానికి అనుమతిస్తున్న ఎయిర్‌లైన్ కంపెనీలు.. సామాన్యులపై మాత్రం ఆంక్షలు విధిస్తున్నాయని మండిపడింది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై విధించిన నిషేధం విషయంలో దేశీయ విమానాయాన సంస్థలు ఏమాత్రం వెనుకకు తగ్గని నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలు గురువారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి ఈ అంశంపై చర్చించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా శివసేన ఎంపీలు విమానాయాన సంస్థల తీరుపై దుమ్మెత్తిపోశారు. ఎంపీలతో తప్పుగా ప్రవర్తించినందుకు మొదట ఎయిరిండియానే క్షమాపణ చెప్పాలని అన్నారు. 'గైక్వాడ్ చేసిన తప్పేమిటి? ఎయిర్‌లైన్ కంపెనీల ప్రవర్తన మాఫియా, గూండాలను తలపిస్తున్నది. మీ కంపెనీల పరిధిలో ఏమైనా జరిగితే చూడాల్సిన బాధ్యత మీకు లేదా? మేం ఇప్పుడు లోక్‌సభ స్పీకర్‌ను కలువబోతున్నాం. అందుకే ఎక్కువ మాట్లాడటం లేదు' అని శివసేన నేత సంజయ్ రావత్ పేర్కొన్నారు. గత గురువారం పుణె-న్యూఢిల్లీ విమానంలో తనకు బిజినెస్ క్లాస్‌ను నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన శివసేన ఎంపీ గైక్వాడ్ ఎయిరిండియా మేనేజర్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అతడిని గైక్వాడ్ 25సార్లు చెప్పుతో కొట్టాడు. ఎంపీ దుష్ర్రవర్తన ఎయిరిండియాను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో గైక్వాడ్‌పై ఎయిరిండియా సహా ఐదు ప్రైవేటు విమానాయాన సంస్థలు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
శివసేన ఎంపీకి తప్పని తిప్పలు
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఉద్యోగిపై దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కు తిప్పలు తప్పడం లేదు. ఉద్యోగిపై దౌర్జన్యం చేయడంతో ఎయిరిండియా సహా ఆరు విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఎక్కించుకునేది లేదంటూ ఆయన టికెట్లు రద్దు చేసేశాయి. దీంతో ఢిల్లీ నుంచి ముంబైకి ఆయన రైళ్లో వెళ్లాల్సి వచ్చింది. ముంబై నుంచి బుక్ చేసుకున్న టికెట్‌తో పాటు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బుక్ చేసుకున్న విమానం టికెట్‌ను కూడా ఎయిరిండియా రద్దు చేయడంతో రోడ్డు మార్గంలో ఢిల్లీకి బయలుదేరారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్లాలని టిక్కెట్లు తీసుకున్నప్పటికీ చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకున్నారు. గైక్వాడ్ కారులో ఢిల్లీకి బయలుదేరిన విషయాన్ని ఉమర్గా పట్టణానికి చెందిన ఆయన స్నేహితుడొకరు వెల్లడించారు. మంగళవారం మధ్యహ్నం గైక్వాడ్, ఆయన భార్య కారులో పుణె నుంచి ఢిల్లీకి పయనమైనట్టు తెలిపారు. బుధవారం సాయంత్రానికి వీరు ఢిల్లీ చేరుకుంటారని చెప్పారు. ఈ రోజు లోక్ సభ సమావేశాలకు హాజరుకారని వెల్లడించారు. రేపటి నుంచి ఆయన లోక్ సభ సమావేశాలకు హాజరవుతారు. -
ఆ ఎంపీకి మళ్లీ రైలే గతి
ఎయిరిండియా విమానంలో వెళ్లాలని ఎంతలా ప్రయత్నించినా శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పాచికలు పారలేదు. చివరకు ఆయన రైల్లోనే వెళ్లాల్సి వచ్చింది. ముంబై నుంచి బుక్ చేసుకున్న టికెట్‌తో పాటు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బుక్ చేసుకున్న విమానం టికెట్‌ను కూడా ఎయిరిండియా రద్దు చేసేసింది. దాంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి ఢిల్లీ వెళ్లారు. విమానం ఎక్కనివ్వకపోవడం సరికాదని, ఇలా ఒక ప్రయాణికుడిని.. అందునా ఎంపీని నిషేధించడం తగదని పార్లమెంటులో ఎన్ని చర్చలు జరిగినా ఎయిరిండియా మాత్రం ససేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రవీంద్ర గైక్వాడ్‌ను తమ విమానాల్లో ఎక్కించుకునేది లేదని పట్టుబట్టింది. దాంతో.. ఆయన రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ స్లీపర్ బోగీలో టికెట్ బుక్ చేసుకుని ముంబై నుంచి ఢిల్లీ వెళ్లారు. ఆ రైలు ముంబైలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు బయల్దేరి ఢిల్లీకి బుధవారం ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుంది. గడిచిన నాలుగు రోజుల్లో రవీంద్ర గైక్వాడ్ ఇలా రైల్లో వెళ్లడం ఇది రెండోసారి. ఎయిరిండియా మేనేజర్ సుకుమార్ (60)ని 25 సార్లు చెప్పుతో కొట్టడంతో పాటు మెట్ల మీద నుంచి కిందకు తోసేయడంతో ఎయిరిండియా వర్గాలు గైక్వాడ్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఒక ప్రయాణికుడిని ఎక్కించుకోవాలా వద్దా అనే విషయంలో ఎయిరిండియాదే పూర్తి నిర్ణయాధికారమని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పార్లమెంటులో చెప్పారు. తనకు ఓపెన్ బిజినెస్ క్లాస్ టికెట్ ఉన్నా, ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాల్సి రావడమే ఎంపీ ఆగ్రహానికి కారణమని తెలిసింది. ఎంపీకి జరిగిన అవమానానికి నిరసనగా శివసేన సోమవారం నాడు ఉస్మానాబాద్‌లో బంద్ నిర్వహించింది.