‘నేను పేదోడ్ని.. చార్టర్‌ విమానాల స్థోమతెక్కడిది?’ | I'm Poor, Can't Afford to Charter Plane: MP Gaikwad | Sakshi
Sakshi News home page

‘నేను పేదోడ్ని.. చార్టర్‌ విమానాల స్థోమతెక్కడిది?’

Published Thu, Apr 6 2017 9:14 AM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM

‘నేను పేదోడ్ని.. చార్టర్‌ విమానాల స్థోమతెక్కడిది?’ - Sakshi

‘నేను పేదోడ్ని.. చార్టర్‌ విమానాల స్థోమతెక్కడిది?’

న్యూఢిల్లీ: తాను చాలా పేదవాడినని, చార్టర్‌ విమానాల వ్యయాన్ని భరించే స్థోమత తనకు లేదని శివసేన పార్టీ వివాదాస్పద ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ అన్నారు. ఆయన గురువారం పార్లమెంటుకు హాజరవుతున్నారు. ఎయిర్‌ ఇండియా ఉద్యోగిపై చేయి చేసుకున్న నేపథ్యంలో విమానమే ఎక్కనివ్వకుండా ఆయనపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఇప్పటికీ అదే విషయంపై వివాదం రేగుతున్న నేపథ్యంలో ఆయన గురువారం పార్లమెంటుకు హాజరై లోక్‌సభలో ఈ విషయంపై సమాధానం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆయన తన తప్పే లేదని, అందరికీ తెలిసింది కొంతేనని, తెలియాల్సింది తాను గురువారం సభలో అనంతరం మీడియాలో చెబుతానని అన్నారు. ప్రస్తుతం విమానాల్లో నిషేధం ఉన్న ఆయన చార్టెడ్‌ ఫ్లైట్‌లో మహారాష్ట్ర నుంచి బయలుదేరి పార్లమెంటుకు హాజరవుతారని వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని మీడియా ఆయనను ప్రశ్నించగా ‘నేనొక పేదవాడిని. చార్టర్‌ విమానాన్ని భరించే స్థోమత నాకు లేదు’ అని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement