
మహారాష్ట్ర విమానాశ్రయాల్లో భద్రత పెంపు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో అన్ని విమానాశ్రయాల్లో భద్రతను పెంచాలని ఎయిర్ ఇండియా యాజమాన్యం సూచించింది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ వివాదంపై పార్లమెంట్ లో గందరగోళం రేగడంతో ఎయిర్ ఇండియా అప్రమత్తమైంది. ముంబయి నుంచి ఎయిర్ ఇండియా విమానాలు ఎలా ఎగురుతాయో చూస్తామని శివసేన ఎంపీలు హెచ్చరించడంతో విమానాశ్రయాల్లో భద్రత పెంచాలని కోరింది.
చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూచించారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, శివసేన ఎంపీలు చర్చలు జరిపి ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని కోరారు. ఈ అంశంపై లోక్ సభలో గురువారం శివసేన ఎంపీలు ఆందోళనకు దిగారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో లోక్ సభలో గందరగోళం రేగింది.