కేంద్రం చేపట్టనున్న ‘స్మార్ట్ సిటీస్’ ప్రాజెక్టును వచ్చే నెలలో ప్రారంభించే అవకాశముందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు.
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం చేపట్టనున్న ‘స్మార్ట్ సిటీస్’ ప్రాజెక్టును వచ్చే నెలలో ప్రారంభించే అవకాశముందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రాలు, ఇతర భాగస్వాములతో సంప్రదింపులు పూర్తయ్యాయని వెల్లడించారు. సోమవారం ఢిల్లీలో స్మార్ట్ సిటీల అంశంపై నిర్వహించిన ఒక సెమినార్‌లో వెంకయ్యనాయుడు మాట్లాడారు. దేశంలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సమ్మిళిత వృద్ధే మార్గమన్నారు. స్మార్ట్ సిటీల ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన అనుమతులను ఈ నెల చివరిలోగా పొందుతామని... వచ్చే నెలలో ప్రాజెక్టును అమల్లోకి తెస్తామని వెంకయ్య తెలిపారు.