సురక్షితంగా ల్యాండ్ అయిన ఫైటర్ జెట్ | Indian Air Force's Mirage fighet jet lands on the Yamuna Expressway | Sakshi
Sakshi News home page

సురక్షితంగా ల్యాండ్ అయిన ఫైటర్ జెట్

Published Thu, May 21 2015 10:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM

సురక్షితంగా ల్యాండ్ అయిన ఫైటర్ జెట్

సురక్షితంగా ల్యాండ్ అయిన ఫైటర్ జెట్

నోయిడా:  భారత  వైమానికి దళానికి చెందిన  మిరాగ్ 2000  ఫైటర్ జెట్   సురక్షితంగా  ల్యాండ్ అయింది.    యుద్ధ విమానం అత్యవసర  ల్యాండింగ్ కోసం   జరిగిన పరీక్షల్లో భాగంగా గురువారం ఉదయం ఢిల్లీ  శివారులోని యమునా ఎక్స్ప్రెస్ హైవేపై    సురక్షితంగా దిగి... మళ్లీ టేక్ ఆఫ్ తీసుకుంది.    

పలువురు సీనియర్ అధికారుల సమక్షంలో  గాలిలో  కొద్ది సేపు చక్కర్లు కొట్టిన అనంతరం  ఫైటర్ జెట్  విజయ వంతంగా భూమి మీదకు దిగింది.   మధురైకి సమీపంలో సాధారణ పరిశోధనలో భాగంగానే   ఈరోజు ఉదయం పరీక్ష నిర్వహించినట్టు  తెలుస్తోంది.   ఇది రొటీన్ ఆపరేషన్లో భాగమేనని  సమాచారం. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై  కొన్ని గంటలపాటు భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
ఇలాంటి పరీక్షలను మరిన్ని నిర్వహించేందుకు అధికారులు  ఆలోచిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement