సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రైళ్లు అపరిశుభ్రంగా ఉండడానికి ప్రధాన కారణం.. టాయిలెట్లే. సరిగ్గా పనిచేయని టాయిలెట్లు, మురికి వాతావరణంతో రైలు మొత్తం చెత్తగా మారిపోతోంది. రైళ్లలో టాయిలెట్లను క్లీన్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటోందని సిబ్బంది కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని రైళ్లలోని టాయిలెట్లను పూర్తిగా ఆధునీకరించేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతోంది.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రైళ్లలో బయో టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. విమానాళ్లో ఉపయోగించే బయో వ్యాక్యూమ్ టాయిలెట్లను రైళ్లలోనూ ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే శాఖ పేర్కొంది. తొలివిడతలో భాగంగా శతాబ్ది, రాజధాని రైళ్లలో వీటిని బయో వ్యాక్యూమ్ టాయిలెట్లను ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ప్రకించారు.
Comments
Please login to add a commentAdd a comment