
న్యూఢిల్లీ: రైల్లో ప్రయాణించినపుడల్లా మనమంతా చుక్.. చుక్ అనే శబ్దాన్ని వినే ఉంటాము. అయితే డిసెంబర్ కల్లా రైళ్లు ఆ శబ్దం లేకుండా ప్రయాణం చేస్తాయని అధికారులు చెప్పారు. ఇప్పుడు రైళ్ల చివరల్లో ఉండే పవర్ కార్స్‌ను తొలగించి రైలుపైన కరెంటు తీగల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. తొలగించే పవర్ కార్ స్థానంలో బోగీ ఏర్పాటు చేసి లగేజీ, గార్డులకు వాడతామన్నారు. ఇందులో దివ్యాంగులకు 6 సీట్లను రిజర్వ్ చేయనున్నారు. మరో 31 సీట్లతో పాటు లగేజీ తీసుకెళ్లే సదుపాయం కల్పించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు ఒక సైలెంట్ జనరేటర్ ఉంచనున్నారు. ప్రస్తుతం పవర్ కార్లు 105 డెసిబిల్స్ శబ్దం చేస్తుండగా ఇకపై అది ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment