అలా.. నడుచుకుందాం
- ఒప్పందం ప్రకారం ముందుకెళదాం
- అలాచేస్తే సమస్య పరిష్కారం అవుతుంది
- వరల్డ్ బ్యాంక్‌కూడా మా వైపే ఉంది
- ఐరాసలో పాక్ ప్రధాని
ఐక్యరాజ్య సమితి : సింధూ నదీ జలాలపై పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించింది. సింధూనదిపై భారత్ కేవలం విద్యుత్ అవసరాలకోసమే ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నా.. పాక్ మాత్రం వాటిపై వివాదాలను రాజేస్తోంది. తాజాగా ఐక్యరాజ్య సమతి సర్వప్రతినిధి సమావేశంలో ప్రసంగించిన పాక్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ.. సింధూ నదీ జలాలపై గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం సమస్యను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఇరు దేశాల మధ్య నదీ జలాల విషయంపై ఎటువంటి వివాదాలు చెలరేగిన ఒప్పందం ప్రకారంపరిష్కరించుకోవచ్చని తెలిపారు. నదీ జలాలపై ఏర్పడ్డ సమస్య విషయంలో ప్రపంచ బ్యాంక్ కూడా మా వైఖరిని సమర్థించిందని పేర్కొన్నారు.
సింధూనదిపై భారత్ నిర్మిస్తున్న కిషన్‌గంగ, రాట్లే ప్రాజెక్టు వివాదంపైఘీ నెల 14,15 తేదీల్లో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు భారత్-పాక్‌దేశాలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.. అయితే ఈ చర్చలు ఏ మాత్రం ఫలవంతం కాలేదు.
ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్-పాకిస్తాన్‌లో 1960లో ప్రపంచబ్యాంక్ సమక్షంలో సింధూ నదీ జలాలపై ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ నదీ జలాలపై ఏమైనా సమస్యలు, వివాదాలు ఏర్పడితే.. ప్రపంచబ్యాంక్ మధ్యవర్తిత్వం చేయవచ్చు.