అమెరికా గూఢచర్య విమానాలకు నెహ్రూ అనుమతిచ్చారు! | Jawaharlal nehru permitted CIA spy planes to use Indian air base | Sakshi
Sakshi News home page

అమెరికా గూఢచర్య విమానాలకు నెహ్రూ అనుమతిచ్చారు!

Published Sat, Aug 17 2013 4:52 AM | Last Updated on Thu, Apr 4 2019 3:19 PM

అమెరికా గూఢచర్య విమానాలకు నెహ్రూ అనుమతిచ్చారు! - Sakshi

అమెరికా గూఢచర్య విమానాలకు నెహ్రూ అనుమతిచ్చారు!

వాషింగ్టన్: భారత వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకుని చైనాపై గూఢచర్యం జరిపేందుకు అమెరికా గూఢచర్య సంస్థ (సీఐఏ)కు 1962లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అనుమతినిచ్చారట. చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్ ఓటమిపాలైన తర్వాత అమెరికాతో ఈ మేరకు ఒప్పందం కుదిరిందట. సీఐఏ రహస్య జాబితా నుంచి తొలగించిన అధికారిక పత్రాలను ఈ మేరకు నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్స్ సంస్థ శుక్రవారం బయటపెట్టింది. 400 పత్రాల సీఐఏ నివేదికను సమాచార స్వాతంత్య్ర చట్టం కింద పొందినట్లు తెలిపింది.దీని ప్రకారం... చైనా భూభాగంపై సీఐఏకు చెందిన యూ-2 గూఢచర్య విమానాలతో గూఢచర్యం జరిపేందుకు 1962, నవంబర్ 11న నెహ్రూఆమోదం తెలిపారు.
 
 ఒడిశాలోని చార్బాటియా వైమానిక స్థావరంలో యూ-2 విమానాలు ఇంధనం నింపుకునేందుకు, చైనా సరిహద్దుల్లో భారత గగనతలంపై ఎగిరేందుకు నెహ్రూ అనుమతించారు. 1963లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ, భారత రాష్ట్రపతి ఎస్.రాధాకృష్ణన్‌ల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. కానీ భారత్ జాప్యం చేయడంతో చివరికి థాయిలాండ్ నుంచి చైనాపై అమెరికా గూఢచర్యాన్ని ప్రారంభించింది. అయితే 1964లో నెహ్రూ మరణించడంతో భారత్ నుంచి ఈ గూఢచర్య కార్యకలాపాలు మరింత వాయిదాపడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement