ముంబై: 70 ఏళ్ల క్రితం ప్రచురించిన ఓ పుస్తకాన్ని ముంబైకి చెందిన హిందూ సంస్థ తిరిగి వెలుగులోకి తెస్తూ వివాదాలకు తెరలేపింది. జీసస్ క్రీస్తు పుట్టుక, మనుగడకు సంబంధించి అనేక వివాదాస్పద అంశాలను దీనిద్వారా వెలుగులోకి తెస్తోంది. జీసస్ క్రీస్తు తమిళనాడుకు చెందిన హిందువని, హిమాలయాల్లో సంచరించాడని స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ (వీర్) సావర్కర్ పెద్దన్న గణేష్ దామోదర్ (బాబారావు) పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ వ్యవస్థాపకుల్లో ఒకరైన గణేష్ ..క్రీస్తు పుట్టుక, ఆయన పెరిగిన వాతావరణం, మాతృభాషకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 1946లో ఆయన రాసిన క్రీస్తు పరిచయ్ అనే పుస్తకాన్ని మరాఠీ భాషలో ఈ నెల 26న దీన్ని విడుదల చేస్తోంది.
క్రీస్తు జన్మస్థలం గురించి ప్రత్యేకంగా చెప్పకపోయినప్పటకీ ఈనాటి పాలస్తీనా, అరబ్ భూభాగాలు హిందూభూభాగంలో భాగమని అలా క్రీస్తు భారతదేశానికి పయనించినట్టు స్పష్టం చేస్తోంది. జీసస్ విశ్వకర్మ బ్రాహ్మిణ వర్గానికి చెందినవాడంటోంది. దీంతోపాటు కొన్ని కీలక అంశాలను ఇందులో పేర్కొన్నారు.
జీసస్ తమిళ హిందువు. పేరు కేశవ్ కృష్ణ, నల్లగా ఉండే అతని మాతృభాష తమిళం. అతను 12 ఏళ్ళ వయసులో బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం క్రీస్తు కు ఉపనయన వేడుక జరిగింది. భారతీయ సంప్రదాయ ప్రకారం అతని వస్త్రధారణ ఉండేది. క్రీస్తు తన జీవితంలో చివరి దశలో హిమాలయాలలో గడిపారు. అరేబియా ఒక హిందూభూమి. యూదులు హిందువులు. అరబిక్ అనేక సంస్కృత, తమిళ పదాలను కలిగి ఉంది, పాలస్తీనా యొక్క అరబీ భాషా తమిళ భాష యొక్క ఒక వెర్షన్.
యోగ మరియు ఆధ్యాత్మిక శాస్త్రం క్రీస్తు అభ్యసించాడని, ఆరోగ్య కూడగట్టుకునేందుకు హిమాలయాల దిగువ ప్రాంతాల్లో క్రీస్తు ఒక మఠాన్ని స్తాపించి, మూడేళ్లపాటు శివుడిని ఆరాధించి, శివ దర్శన భాగ్యాన్ని పొందాడాని వాదిస్తోంది. ఆయన చివరి దశలో ఔషధ మూలికలద్వారా చికిత్స జరిగిందని ఈపుస్తకంలో పేర్కొన్నారు. అతను తన భౌతిక శరీరం వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నపుడు ఉన్నప్పుడు క్రీస్తు 49 ఏళ్లు. అతను ఒక యోగ భంగిమలో కూర్చుని లోతైన సమాధి లోకి వెళ్ళిపోయాడని ఈ పుస్తకంలో రాశారు. క్రిస్టియానిటీ ఎప్పటికీ ఒక ప్రత్యేక మతం కాదని...హిందూ మతంలోని శాఖను ఒక సిద్ధాంతంగా క్రీస్తు పరిచయం చేశాడని ఈ పుస్తకంలో పేర్కొన్నారు.
కాగా త్వరలో విడుదల కానున్న ఈ పుస్తకంలోని అంశాలపై అప్పుడే దుమారం మొదలైంది. ఇదంతా అసత్యాలను ప్రచారం చేసి, దాన్నే చరిత్రగా చూపే కుట్రలోభాగమని విమర్శలు చెలరేగుతున్నాయి.