విమానం ఇంజిన్ పేలిపోయింది!
పనాజీ: గోవా ఎయిర్ పోర్ట్ ఘటనపై జెట్ ఎయిర్ వేస్ ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ప్రమాదం జరిగి 20-25 నిమిషాలు గడిచినా అధికారులు అక్కడకి రాలేదని, ఆ సమయంలో అసలు ఏం జరగుతుందో తమకు అర్థం కాలేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేశారు. 'ఇది చాలా చిన్న విషయంగా ప్రచారం చేశారు. కానీ చాలా భయంకరమైన ఘటన ఇది. దాదాపు విమానం ఇంజిన్ పేలిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత కార్లలో వచ్చి గాయపడ్డ కొందరిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. కొందరు తమ తోటి ప్యాసింజర్స్ చనిపోయి ఉండొచ్చు'నని ఓ గోవా నుంచి ముంబై వెళ్తున్న ఓ ప్రయాణికుడు జాతీయ మీడియా ఏఎన్ఐతో చెప్పాడు.
'పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రన్ వే పై టేకాఫ్ అవుతుండగా విమానం ఓ వైపునకు ఒరిగిపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. అధికారులను అడిగితే వారు నోరు విప్పడం లేదు. మాకు కొద్దిసేపు ఎవరూ సహాయం చేయడానికి ముందుకురాలేదు. ఆ సమయంలో పరిస్థితి వర్ణనాతీతం' అని జెయిర్ ఎయిర్ వేస్ ప్యాసింజర్లలో ఒకరైన అభిషేక్ తెలిపారు.