plane skidded
-
విమానం ఇంజిన్ పేలిపోయింది!
పనాజీ: గోవా ఎయిర్ పోర్ట్ ఘటనపై జెట్ ఎయిర్ వేస్ ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ప్రమాదం జరిగి 20-25 నిమిషాలు గడిచినా అధికారులు అక్కడకి రాలేదని, ఆ సమయంలో అసలు ఏం జరగుతుందో తమకు అర్థం కాలేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేశారు. 'ఇది చాలా చిన్న విషయంగా ప్రచారం చేశారు. కానీ చాలా భయంకరమైన ఘటన ఇది. దాదాపు విమానం ఇంజిన్ పేలిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత కార్లలో వచ్చి గాయపడ్డ కొందరిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. కొందరు తమ తోటి ప్యాసింజర్స్ చనిపోయి ఉండొచ్చు'నని ఓ గోవా నుంచి ముంబై వెళ్తున్న ఓ ప్రయాణికుడు జాతీయ మీడియా ఏఎన్ఐతో చెప్పాడు. 'పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రన్ వే పై టేకాఫ్ అవుతుండగా విమానం ఓ వైపునకు ఒరిగిపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. అధికారులను అడిగితే వారు నోరు విప్పడం లేదు. మాకు కొద్దిసేపు ఎవరూ సహాయం చేయడానికి ముందుకురాలేదు. ఆ సమయంలో పరిస్థితి వర్ణనాతీతం' అని జెయిర్ ఎయిర్ వేస్ ప్యాసింజర్లలో ఒకరైన అభిషేక్ తెలిపారు. -
గోవాలో విమానానికి తప్పిన ముప్పు !
-
జెట్ ఎయిర్వేస్ విమానానికి తప్పిన ముప్పు!
పనాజీ: గోవా ఎయిర్ పోర్ట్లో జెట్ ఎయిర్ వేస్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. గోవా నుంచి ముంబైకి వెళ్లవలసిన జెట్ ఎయిర్ 9W 2374 విమానం డబ్లిమ్ ఎయిర్పోర్టులో టేకాఫ్ అయ్యే సమయంలో పట్టుతప్పి, పక్కకు ఒరిగిపోయింది. దీంతో నేటి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులు, సిబ్బందికి పెద్దగా సమస్యలు తలెత్తలేదు. విమానం ఓ వైపునకు ఒరిగిపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెంది, పెద్దగా అరవడం మొదలుపెట్టారు. అయితే ఎలాంటి దుర్ఘటన జరగకపోయేసరికి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. జెట్ ఎయిర్ వేస్ విమానంలో ఏడుగురు సిబ్బంది, 154 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులను ఎయిర్ పోర్ట్ నుంచి సురక్షితంగా తరలించే క్రమంలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయని జెట్ ఎయిర్ వేస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. జెట్ ఎయిర్ వేస్ బృందంతో పాటు ఎయిర్ పోర్టు అధికారులు ఈ ఘటనలో గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.