గోవాలో విమానానికి తప్పిన ముప్పు ! | Jet Airways plane skidded at Dabolim airport in goa | Sakshi
Sakshi News home page

Dec 27 2016 9:06 AM | Updated on Mar 22 2024 11:30 AM

గోవా ఎయిర్ పోర్ట్‌లో జెట్ ఎయిర్ వేస్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. గోవా నుంచి ముంబైకి వెళ్లవలసిన జెట్ ఎయిర్ 9W 2374 విమానం డబ్లిమ్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయ్యే సమయంలో పట్టుతప్పి, పక్కకు ఒరిగిపోయింది. దీంతో నేటి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులు, సిబ్బందికి పెద్దగా సమస్యలు తలెత్తలేదు. విమానం ఓ వైపునకు ఒరిగిపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెంది, పెద్దగా అరవడం మొదలుపెట్టారు. అయితే ఎలాంటి దుర్ఘటన జరగకపోయేసరికి వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement