భారత్‌.. జీహాదీల లక్ష్యం​ | Jihad' against India | Sakshi
Sakshi News home page

భారత్‌.. జీహాదీల లక్ష్యం​

Published Sat, Sep 2 2017 3:47 PM | Last Updated on Tue, Sep 12 2017 1:39 AM

Jihad' against India

  • కశ్మీర్‌ స్వేచ్ఛే లక్ష్యం
  • భారత్‌లో జీహాద్‌ మరింత తీవ్రతరం
  • ప్రకటించిన జమాత్‌ ఉద్‌ దవా చీఫ్‌ అబ్దుల్‌ రెహమాన్‌

లాహోర్‌ : భారత్‌ లక్ష్యంగా జీహాదీలు తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఉవ్రవాద సంస్థ జమాత్ ఉద్‌ దవా చీఫ్‌ అబ్దుల్‌ రెహమాన్‌ మక్కీ తీవ్రవాదులకు ఉద్భోధించారు. జమ్మూ కశ్మీర్‌కు స్వేచ్ఛ లభించే వరకూ పోరాటం చేయాలని రెహమాన్‌ మక్కీ తీవ్రవాదులకు రెచ్చగొట్టేలా పేర్కొన్నారు. భారత్‌లో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాది అబు వాలెద్‌ మహ్మద్‌ను భద్రతా బలగాలు మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. లాహోర్‌లో జరిగిన వాలెద్‌ సంస్మరణ సభలో పాల్గొన్న రెహమాన్‌ మక్కీ.. సీమాంతర ఉగ్రవాదాన్ని మరింత ప్రోత్సహిస్తామని అన్నారు. మరికొంత మంది యువకులకు జీహాదీ శిక్షణ ఇచ్చి కశ్మీర్‌లోకి పంపుతామని ప్రకటించారు. భారత ప్రభుత్వంతో పోరాడుతున్న కాశ్మీరీలకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని  రెహమాన్‌ మక్కీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement