ముంబై : అగ్రరాజ్యం అమెరికా అంతర్జాతీయ ప్రాబల్యాన్ని కోల్పోతుండటం, చైనా పాత్ర బలహీనపడటంతో ప్రపంచంలో భారత్ ప్రబల శక్తిగా అవతరించే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, గోల్డ్‌మన్ శాక్స్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ జిమ్ ఓనిల్ అన్నారు. భారత్ దూకుడుగా సంస్కరణలు అమలు చేస్తే ప్రాబల్య శక్తిగా మారుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత సంక్షోభ నేపథ్యంలో అమెరికా తన అంతర్జాతీయ ఆధిపత్యాన్ని కోల్పోతోందని, చైనా పాత్ర బలహీనపడుతుండగా ఈ రెండు దేశాల స్ధానంలో రానున్న రెండు దశాబ్ధాల్లో భారత్ ప్రాబల్యం పెరుగుతుందని అన్నారు.
జనాభా, ఆర్థిక వ్యవస్థ పరిమాణం వంటి అంశాల ప్రాతిపదికన భారత్‌కు మరే దేశం పోటీ కాదని ఆయన ఈటీ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కరోనా వైరస్‌తో నెలకొన్న సంక్షోభాన్ని భారత్ అవకాశంగా మలుచుకోవాలని సూచించారు. గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో సంస్కరణలను వేగవంతం చేయాలని మౌలిక వసతులను మెరుగుపరుచుకోవాలని జిమ్ పేర్కొన్నారు. సేవా రంగంలో భారత్ సప్లయి చైన్ ప్రభావవంతమైందని, ప్రస్తుత సంక్షోభంతో గ్లోబల్ సప్లయి చైన్‌లో చైనా పాత్ర బలహీనమైందని ప్రస్తావించారు. భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment