ఉగ్రవాదుల ఇంటికెళ్లిన యాసిన్ అరెస్ట్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ జేకేఎల్‌ఎఫ్ చైర్మన్ మహమ్మద్ యాసిన్ మాలిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం మైసుమాలోని లాల్ చౌక్‌కు సమీపంలో ఉన్న ఆయన ఇంటి వద్దే అదుపులోకి తీసుకొని శ్రీనగర్ కేంద్ర కారాగారానికి తరలించారు. శనివారం యాసిన్ మాలిక్ ఉగ్రవాదుల ఇళ్లకు వెళ్లాడు.
దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోగల ట్రాల్ ప్రాంతంలోని ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులు సబ్జార్ అహ్మద్ భట్, ఫైజన్ ముజఫర్ ఇంటికి వెళ్లిన యాసిన్ ఏవో రహస్య మంతనాలు జరిపినట్లు పోలీసులకు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. శనివారం ఇదే ట్రాల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే.