అమానుల్లా ఖాన్ కన్నుమూత | JKLF founder Amanullah Khan dead at 82 | Sakshi
Sakshi News home page

అమానుల్లా ఖాన్ కన్నుమూత

Published Tue, Apr 26 2016 1:40 PM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

అమానుల్లా ఖాన్ కన్నుమూత

అమానుల్లా ఖాన్ కన్నుమూత

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు అమానుల్లాఖాన్  (82) మంగళవారం తుది శ్వాస విడిచారు.    తీవ్ర ఊపిరితిత్తుల  వ్యాధితో బాధపడుతూ పాకిస్తాన్ లోని రావల్పిండిలో మరణించారని ఆయన అల్లుడు సజ్జద్ లోన్ తెలిపారు. గత మూడు వారాలుగా అమానుల్లా ఖాన్  ఆరోగ్యం మరింత విషమించిదని తెలిపారు. ఆయన అంతియ ఘడియల్లో   అమానుల్లా ఖాన్ కుమార్తె, తన భార్య ఆస్మాఖాన్, పిల్లలు ఆయనతోనే  వున్నామన్నారు.


కాగా 1934 ఆగస్టులో  జన్మించిన అమానుల్లా  కశ్మీర్ స్వాతంత్ర్యం  కోసం పోరాటం  చేశారు. ఈ క్రమంలో   కొంతమంది న్యాయవాదులతో కలిసి 1977  జెకెఎల్ఎఫ్ ను స్థాపించారు. ఇండియా, పాకిస్తాన్ నుంచి కశ్మీర్ కు    స్వేచ్ఛ లభించాలని ఆయన కోరుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement