Amanullah Khan
-
చాంద్రాయణగుట్టకు 45 ఏళ్లుగా ఇద్దరే..
సాక్షి, హైదరాబాద్: అక్కడ ఇప్పటివరకు ఇద్దరంటే ఇద్దరే ఎమ్మెల్యేలుగా గెలిచారు.. అలా అని అదేం కొత్తగా ఏర్పడిన నియోజకవర్గమేమీ కాదు.. ఏకంగా పదిసార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కొక్కరు వరుసగా అయిదుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. అదెక్కడో కాదు..పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో. ఒకరేమో అమానుల్లాఖాన్ కాగా మరొకరు అక్బరుద్దీన్ ఒవైసీ. అమానుల్లాఖాన్ ప్రస్థానం ఇలా ♦ 1978 ఎన్నికలకు ముందు చాంద్రాయణగుట్ట నియోజక వర్గం ఏర్పడింది. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన అమానుల్లాఖాన్ కాంగ్రెస్ అభ్యర్థి బాలయ్యపై 1,333 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ♦ 1983లో ఎ.నరేంద్ర(బీజేపీ)పై 3,581 ఓట్లతో, 1985లో 3,009 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ♦ 1989 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థిపై 28,147 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ♦1994 ఎన్నికల నాటికి సలావుద్దీన్ ఒవైసీతో విభేదించి మజ్లిస్‌కు పోటీగా అమానుల్లాఖాన్ ఎంబీటీ పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఎంబీటీ తరఫున పోటీచేసి ఎంఐఎం అభ్యర్థిపై 35,210 ఓట్లతో గెలిచారు. అక్బరుద్దీన్ ఒవైసీ ఎంట్రీతో... ♦ అమానుల్లాఖాన్ వరుస విజయాలకు అడ్డుకట్ట వేసేలా సలావుద్దీన్ ఒవైసీ తన చిన్న కుమారుడు అక్బరుద్దీన్ ఒవైసీని 1999 ఎన్నికల్లో పోటీకి దింపారు. ఆ ఎన్నికల్లో 11,920 ఓట్ల మెజారిటీతో అక్బరుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. ♦ 2004 ఎన్నికల్లో 11,949 ఓట్ల మెజా రిటీతో గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో 15,177 ఓట్లతో, 2014లో 59,279 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మోగించారు. 2018 ఎన్నికల్లో అక్బరుద్దీన్ ఒవైసీ భాజపా అభ్యర్థి షెహాజాదీ సయ్యద్‌పై 80,264 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. వరుసగా అయిదు సార్లు గెలిచి అమానుల్లాఖాన్ రికార్డును సమం చేశారు. ఈ ఎన్నికల్లో కూడా అక్బర్ చాంద్రాయణగుట్ల నుంచే పోటీ చేస్తున్నారు. -
కేజ్రీవాల్‌కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. ఆయన వ్యక్తిగత సలహాదారుడు వీకే జైన్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం జైన్ తన రాజీనామా లేఖను సీఎంవో కార్యాలయానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల తన పదవి నుంచి వైదోలుగుతున్నట్లు తన రాజీనామ లేఖలో పేర్కోన్నారు. అయితే ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్‌పై దాడి కేసులో జైన్ సాక్షి ఉండటంతో ఆయన రాజీనామా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు రెండురోజుల క్రితమే జైన్‌ను సీఎస్ దాడి వ్యవహారంలో పోలీసులు విచారించారు కూడా. కాగా, గతనెల 22వ తేదీన ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ అన్షు పై ఆప్ ఎమ్మెల్యేలు అమానుతుల్లా ఖాన్, ప్రకాశ్ జార్వల్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని.. ఎమెల్యేలు దాడి చేయటం చూశానని విచారణలో జైన్ తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి సీఎం కార్యాలయానికి దూరంగా ఉంటున్న జైన్.. హఠాత్తుగా రాజీనామా చేయటం విశేషం. ఇప్పటికే వరుస ఆరోపణలతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న కేజ్రీవాల్‌కు.. ఇప్పుడు జైన్ రాజీనామా దిగ్భ్రాంతికి కలిగించేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అమానుల్లా ఖాన్ కన్నుమూత
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు అమానుల్లాఖాన్ (82) మంగళవారం తుది శ్వాస విడిచారు. తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ పాకిస్తాన్ లోని రావల్పిండిలో మరణించారని ఆయన అల్లుడు సజ్జద్ లోన్ తెలిపారు. గత మూడు వారాలుగా అమానుల్లా ఖాన్ ఆరోగ్యం మరింత విషమించిదని తెలిపారు. ఆయన అంతియ ఘడియల్లో అమానుల్లా ఖాన్ కుమార్తె, తన భార్య ఆస్మాఖాన్, పిల్లలు ఆయనతోనే వున్నామన్నారు. కాగా 1934 ఆగస్టులో జన్మించిన అమానుల్లా కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. ఈ క్రమంలో కొంతమంది న్యాయవాదులతో కలిసి 1977 జెకెఎల్ఎఫ్ ను స్థాపించారు. ఇండియా, పాకిస్తాన్ నుంచి కశ్మీర్ కు స్వేచ్ఛ లభించాలని ఆయన కోరుకున్నారు.