ఫేస్ బుక్కు సుప్రీం మాజీ న్యాయమూర్తి గుడ్బై
న్యూఢిల్లీ: తన అనూహ్య నిర్ణయాలు, ఎవరూ ఊహించలేని అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెబుతూ నిత్యం వార్తల్లో నిలిచే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ మరోసారి వార్తల్లో నిలిచే ప్రకటన చేశారు. తాను ఫేస్ బుక్కు గుడ్బై చెప్తున్నట్లు ప్రకటించారు.
గణతంత్ర దినోత్సవం రోజు రాత్రి(మంగళవారం రాత్రి) తన ఫేస్ బుక్ పేజీలో తాను ఫేస్ బుక్ నుంచి ఇక సెలవు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అందుకు కారణం కూడా ఆయన వివరించారు. తన సమూల తెలివి తేటలను అందరికి పంచాలనుకున్నారని, కానీ దానివల్ల తిట్లు, విమర్శల రూపంలో స్పందన వెనక్కు వచ్చిందని కట్జూ చెప్పారు. అందుకే భారతీయులకు బోధించాలనుకోవడం తప్పని తనకు అర్థమైనట్లు తెలిపారు. అందుకే ఫేస్ బుక్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు.