Justice katju
-
అతిపెద్ద గూండా ఎవరో తేల్చుకుందాం: కట్జూ
ముంబై : పాకిస్తానీ యాక్టర్లను భారత్‌లో నిషేధించడంపై తీవ్ర చర్చ రేగుతున్న నేపథ్యంలో మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరణ్ జోహార్ అప్‌కమింగ్ ఫిల్మ్ యే దిల్ హే ముస్కిల్ విడుదలను నిలిపివేయడంపై మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్)ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు."నిస్సహాయంపు ఆర్టిస్టులపై ఎంఎన్ఎస్ ఎందుకు దాడిచేస్తుంది? ఒకవేళ ధైర్యముంటే నా ముందుకు రండి. మీ అసహనానికి నా దగ్గర దండన ఉంది. మీ కోసమే ఈ దండన వేచిచూస్తున్నట్టు" బుధవారం పలు ట్వీట్లు చేశారు. ఎంఎన్ఎస్ ప్రజలు అరేబియన్ సముద్రపు ఉప్పు నీరు తాగే గూండాలని వ్యాఖ్యానించారు. గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమం పవిత్రమైన నీరు తాగే తాను అలహాబాదీ గూండానని పేర్కొన్నారు. తన ముందుకు వస్తే ఎవరు అతిపెద్ద గూండానో తేల్చుకుందామని సవాలు విసిరారు. ఒక్క ఎంఎల్ఏ పార్టీ ఎంఎన్ఎస్ వారి పాఠాలను వారే నేర్చుకోలేకపోతున్నారన్నారు.వచ్చే ఎన్నికల్లో జీరో-ఎంఎల్ఏ పార్టీగా ఎంఎన్ఎస్ నిలుస్తుందని ట్వీట్ చేశారు. కట్జూ వ్యాఖ్యలపై ఎంఎన్ఎస్ వైస్ ప్రెసిడెంట్ వాగీశ్ సారస్వత్ మండిపడ్డారు. కనీసం మాకు ఒక్క ఎంఎల్ఏనైనా ఉన్నారని, అయినా కట్జూ ఏ ఆధారాలతో ఇలా వ్యాఖ్యానిస్తున్నారని ప్రశ్నించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధినేతగా ఉన్న కట్జూ ఇప్పటికే పలు అంశాలపై తీవ్రంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పాకిస్తానీ యాక్టర్ ఫవాద్ ఖాన్ నటించిన కరణ్ జోహార్ సినిమా యే దిల్ హై ముస్కిల్ వచ్చే శుక్రవారం విడుదల కాబోతుంది. కానీ ఆ సినిమా విడుదలను నిలిపివేశారు. జోహార్ ఫిల్మ్‌ను నిలిపివేయడంపై ఎంఎన్ఎస్కు మాజీ ఇండియన్ క్రికెటర్, కామెంటర్ సంజయ్ మంజ్రేకర్ అంత మంచికాదంటూ బెదిరించారు. MNS people are goondas who have drunk the salt water of the Arabian Sea. I am an Allahabadi goonda, who has drunk the water of the Sangam — Markandey Katju (@mkatju) October 19, 2016 So instead of showing your bravery on those helpless artists, come have a dangal with me, and let the world see who is a bigger goonda — Markandey Katju (@mkatju) October 19, 2016 -
ఔను! నా బుర్రలో ఏమీ లేదు: మెగాస్టార్
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ జోవియల్‌గా స్పందించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తనపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డ సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ విషయంలోనూ ఆయన చాలా తేలికగా స్పందించారు. అవును, తన మెదడులో ఏమీ లేదని, దాని పని దాదాపు ’ఖల్లాస్’ (ముగిసిపోయింది) అయిందని చెప్పుకొచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో నిలిచే జస్టిస్ కట్జూ ఇటీవల తనదైన శైలిలో బిగ్ బీని దుయ్యబట్టారు. అమితాబ్ మెదడులో ఏమీ లేదని, ఆయనను మీడియా వ్యక్తులు పొగడ్తల్లో ముంచెత్తుతారు కాబట్టి, వారి మెదళ్లలో కూడా ఏమీ ఉండకపోవచ్చునని కట్జూ చెప్పుకొచ్చారు. తాను బిగ్ బీని అంత తీవ్రంగా విమర్శించడానికి కారణాలు వివరిస్తూ ఓ పెద్ద వ్యాసం కూడా ఆయన తన ఫేస్బుక్ పేజీలో ప్రచురించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే పాలకులకు సినీ స్టార్లు ఉపయోగపడతారని, అంతకుమించి వారి మెదళ్లలో ఏమీ ఉండదని కట్జూ చెప్పుకొచ్చారు. సోమవారం ముంబైలో విలేకరులతో ముచ్చటించిన బిగ్ బీ ఈ అంశంపై స్పందించారు. ’జస్టిస్ కట్జూ చెప్పిందే కరెక్టే. నా మెదడు లోపల నిజంగా ఏమీ లేదు. దేశంలో ఏదైనా జరిగితే.. అందులో మేం పాలుపంచుకుంటాం. కానీ, ఆయనే కరెక్ట్. నా మెదడు ఖల్లాస్ అయింది’ అని వ్యాఖ్యానించారు. -
ప్రకంపనలు రేపుతున్న కొలీజియం
-
జస్టిస్ చలమేశ్వర్‌కు కట్జూ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకం, బదిలీలలో కీలక పాత్ర పోషించే కొలీజియం సమావేశానికి సైద్ధాంతికపరమైన నిర్ణయంతో గైర్హాజరైన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ చలమేశ్వర్‌కు మద్దతు పెరుగుతోంది. చలమేశ్వర్ నిర్ణయానికి ఇప్పటికే ముగ్గురు మాజీ సీజేలు మద్దతుతెలుపగా ఆదివారం సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ సామాజిక మాధ్యమంలో అభినందించారు. ‘హ్యాట్స్ఆఫ్ టు జస్టిస్ చలమేశ్వర్ ఫర్ హిజ్ ప్రిన్సిపుల్డ్ స్టాండ్’ అని జస్టిస్ కట్జూ ట్వీట్ చేశారు. లాంఛనంగా కొలీజియం సమావేశం ప్రారంభం కావడానికి ముందుగానే ‘నా అభ్యర్థికి నువ్వు మద్దతివ్వు, నీ అభ్యర్థికి నేను మద్దతిస్తాను’ అనే విధంగా కొలీజియం సభ్యులు ఒక నిర్ణయానికి వస్తారని జస్టిస్ మార్కండేయ కట్జూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల ఎంపికకు ఇది సరైన విధానమా అని ప్రశ్నించారు. ప్రతిభ కు ఏమౌతుందన్నారు. ఆశ్చర్యం లేదనీ, పలువురు అర్హత లేని వారు ఎంపికయ్యారని జస్టిస్ కట్జూ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంటుందని జస్టిస్ కట్జూ చెప్పారు. పారదర్శకత ఉంటేనే హాజరవుతా... జవాబుదారీతనం, పార దర్శకత ఉంటేనే ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం సమావేశానికి హాజరవుతానని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె. చలమేశ్వర్ అన్నారు. ఆదివారం ఆయన టీవీ చానెల్‌తో మాట్లాడుతూ..కొలీజియం సమావేశానికి తాను హాజరు కాకుడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలని తాను బలంగా నమ్ముతానని...అందుకే ఈ ప్రయత్నమన్నారు. ఈ నిర్ణయంపై సమావేశాన్ని టాప్ ప్యానల్ మినిట్స్ బుక్‌లో రికార్డు చేయాలని ఆయన కోరారు. న్యాయమూర్తుల ఎంపికలో లేదా తిరస్కరణలో తగిన కారణాలను పేర్కొనాలని, ఈ అంశంలో సీజేఐ తగిన హామీనిస్తే సమావేశానికి తప్పకుండా హాజరవుతానన్నారు. చలమేశ్వర్ నిర్ణయం ఇతర న్యాయమూర్తులను నిరాశకు గురిచేసింది. -
నిజమైన భారతీయులు ఆ రాష్ట్రం వారే!
ప్రెస్ కౌన్సిల్ మాజీచైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ తాజాగా ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్టు బాగా హల్ చల్ చేస్తోంది. కేరళ వాసులే 'నిజమైన భారతీయుల'ని కీర్తిస్తూ ఆయన ఈ పోస్టులో ప్రశంసల వర్షం కురిపించారు. 'నిజమైన భారతీయులు' టైటిల్ కు కేరళ వాసులు ఎందుకు అర్హులో వివరిస్తూ.. భారతీయులకు ఉండాల్సిన సహజ లక్షణాలెన్నో వారిలో ఉన్నాయని, ఒకరితో ఒకరి కలిసిమెలిసి సామరస్యంతో జీవించే గొప్ప భారతీయ గుణం కేరళ వాసుల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. వివిధ మతాలు, కులాలు, జాతులకు చెందిన ప్రజలు కేరళలో కలిసిమెలిసి జీవించడం గమనించవచ్చునని, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ ముందుకుసాగుతున్న వారి విశాల దృక్పథాన్ని మిగతా దేశం కూడా అవలంబించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టుతో కేరళ వాసులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కట్జూ వ్యాఖ్యలను స్వాగతిస్తూ.. లైకులు, షేరింగులతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కట్జూ పోస్టుకు 21వేల లైకులు, 14,400 షేరింగులు రాగా.. అందులో అత్యధికంగా కేరళ మిత్రుల నుంచే ఉన్నాయని అంటున్నారు. అయితే, ఈ పోస్టులో ఈశాన్య రాష్ట్రాల గురించి జస్టిస్ కట్జూ మాటమాత్రమైన ప్రస్తావించకపోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
ఫేస్ బుక్కు సుప్రీం మాజీ న్యాయమూర్తి గుడ్‌బై
న్యూఢిల్లీ: తన అనూహ్య నిర్ణయాలు, ఎవరూ ఊహించలేని అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెబుతూ నిత్యం వార్తల్లో నిలిచే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ మరోసారి వార్తల్లో నిలిచే ప్రకటన చేశారు. తాను ఫేస్ బుక్కు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం రోజు రాత్రి(మంగళవారం రాత్రి) తన ఫేస్ బుక్ పేజీలో తాను ఫేస్ బుక్ నుంచి ఇక సెలవు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అందుకు కారణం కూడా ఆయన వివరించారు. తన సమూల తెలివి తేటలను అందరికి పంచాలనుకున్నారని, కానీ దానివల్ల తిట్లు, విమర్శల రూపంలో స్పందన వెనక్కు వచ్చిందని కట్జూ చెప్పారు. అందుకే భారతీయులకు బోధించాలనుకోవడం తప్పని తనకు అర్థమైనట్లు తెలిపారు. అందుకే ఫేస్ బుక్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. -
కొత్తరకం ‘కొలీజియం’
న్యాయమూర్తుల ఎంపిక కోసం ఇప్పుడనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థ స్థానంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తహతహలాడుతున్న వేళ న్యాయవ్యవస్థకు ఇరకాట పరిస్థితులు ఏర్ప డుతున్నాయి. యాదృచ్ఛికమే కావొచ్చుగానీ... కొలీజియం వ్యవస్థ రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టిన సోమవారమే ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం. లోథా ఆ వ్యవస్థను గట్టిగా సమర్ధించుకున్నారు. అంతేకాదు... ప్రజల్లో న్యాయవ్యవస్థను అపఖ్యాతిపాలు చేయడానికి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అయితే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ మార్కండేయ కట్జూ ఈమధ్య వెల్లడించిన కొన్ని అంశాలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. అవినీతిపరులుగా ముద్రపడినవారిని కాపాడటానికి ఫలానా ప్రధాన న్యాయమూర్తి ప్రయత్నించారని జస్టిస్ కట్జూ చెబుతుంటే జనం ఆశ్చర్యపోతున్నారు. ఆయన వ్యాఖ్యల్లోని మర్మం, ఇంతకాలం వాటిని ఎందుకు దాచివుం చారన్నది పక్కనబెడితే న్యాయవ్యవస్థ పనితీరు ఈ స్థాయిలో ఉన్నదా అని దిగ్భ్రాంతిచెందుతున్నారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తున్న బీజేపీకి న్యాయవ్యవస్థ పనిచేస్తున్న తీరుపై చాలాకాలంగా అభ్యంతరాలు న్నాయి. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ రెండేళ్లక్రితం ఒక సదస్సులో మాట్లాడుతూ కొందరు న్యాయమూర్తులు నైతికంగా రాజీపడి, రిటైర య్యాక వచ్చే పదవులకు ఆశపడి అందుకనుగుణంగా తీర్పులు రాస్తు న్నారని ఆరోపించారు. మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇంకాస్త ముందుకెళ్లారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్రం సీబీఐ తోపాటు న్యాయవ్యవస్థను కూడా ఉపయోగించుకుంటున్నదని వ్యా ఖ్యానించారు. రిటైరైన రెండేళ్ల వరకూ న్యాయమూర్తులెవరూ ఎలాంటి పదవులూ తీసుకోరాదన్న సూచన కూడా చేశారు.2008 మొదలుకొని రిటైరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యధిక శాతంమందికి వివిధ కమిషన్ల లోనూ, ట్రిబ్యునళ్లలోనూ అవకాశాలు రావ డాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. స్వాతంత్య్రం వచ్చాక తొలి నాలుగు దశాబ్దాలూ న్యాయమూర్తుల నియామకంలో ఎగ్జిక్యూ టివ్ ఆధిపత్యమే కొనసాగింది. ఈ కాలంలో నియమితులైన చాలా మంది న్యాయమూర్తులు తమ సచ్ఛీలతనూ, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నారు. అందులో సందేహం లేదు. కానీ, 1973లో అప్పటి కేంద్రమంత్రి మోహనకుమార మంగళం చేసిన ఒక వ్యాఖ్య తదుపరి ఆ నియామకాల ప్రక్రియ భ్రష్టుపట్టడం ప్రారంభమైంది. న్యాయమూ ర్తుల నియామకం సమయంలో ఆయా వ్యక్తుల సామాజిక తాత్విక తను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ప్రతిపాదించారు. మన రాజ్యాంగానికుండే సామాజిక తాత్వికతను మాత్రమే కాదు... ప్రభుత్వానికుండే సామాజిక తాత్వికతను కూడా ఒంటబట్టించుకున్న వారినే ఎంపిక చేయాలన్నది ఆయన మాటల్లోని అంతరార్ధం. మొదట్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మోహన కుమార మంగళం సూచనను పట్టించుకోలేదుగానీ... తన ఎన్నిక చెల్లదన్న తీర్పు వెలువ డ్డాక ఇలాంటి ‘అంకితభావం’ ఉన్న న్యాయమూర్తుల ‘అవసరం’ ఎంత ఉన్నదో ఆమె గ్రహించారు. ఎమర్జెన్సీ కాలంలో అలాంటివారిని ఏరి కోరి నియమించారు. ఆ తర్వాత చాలాకాలానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ పుణ్యమా అని ఈ దుస్థితి తప్పింది. కొలీజియం వ్యవస్థను ప్రవేశపెట్టింది ఆయనే. కానీ, ఆ వ్యవస్థ సైతం లోపాలమయం అయిందని అనంతర కాలంలో ఆవేదన వ్యక్తంచేసిందీ ఆయనే. ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా పనిచేస్తేనే ఏ వ్యవస్థ అయినా అర్ధవంతంగా ఉంటుంది. ప్రజాస్వామ్యానికీ, రహ స్యానికీ ఎప్పుడూ చుక్కెదురే. గోప్యత కారణంగానే కొలీజియం వ్యవ స్థ విమర్శలను ఎదుర్కొన్నది. ఈ విమర్శలను పరిగణనలోకి తీసుకుని లోపాన్ని చక్కదిద్దివుంటే ఇప్పుడున్న పరిస్థితి ఏర్పడేది కాదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత అయినా, నిష్పాక్షికత అయినా...అవి న్యాయమూ ర్తులకుండే ప్రైవేటు హక్కులు కాదు, ప్రజలకుండే హక్కులని గుర్తించి వుంటే కొలీజియం వ్యవస్థ ప్రక్షాళనకు చిన్న ప్రయత్నమైనా జరిగేది. ఇప్పుడు కేంద్రం తీసుకొస్తున్న కొత్త బిల్లు కొలీజియం వ్యవస్థకు మంగళం పాడదల్చుకున్నది. న్యాయమూర్తులే తమ సహచరులను ఎంపిక చేసుకునే కొలీజియంకు బదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో జాతీయ న్యాయ నియా మకాల కమిషన్‌ను ఏర్పాటుచేయాలని తాజా బిల్లు ప్రతిపాదిస్తున్నది. ఇందులో కేంద్ర న్యాయ శాఖ మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తు లిద్దరు, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉండాలని మరో ప్రతిపాదన. ప్రముఖ వ్యక్తుల ఎంపికకు ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి, విపక్ష నేతలతో కూడిన మరో కొలీజియం ఉంటుంది. కమిషన్ లోని ఇద్దరు సభ్యులు కాదంటే న్యాయమూర్తిగా నియామకం కుద రదు. ఈ కమిషన్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ, పదోన్నతులు వగైరాలను చూస్తుంది. ఈ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే మరో బిల్లు కూడా సిద్ధమైంది. అయితే, ఎంపిక కోసం పరిశీలిస్తున్నవారి పేర్లు, ఇతర వివరాలు వెల్లడించకుండా సాగించే ఎలాంటి నియామక ప్రక్రియ అయినా ఆచరణలో కొలీ జియం తరహాలోనే విమర్శలకు లోనవుతుందని గుర్తించాలి. నియామ కాల్లో ఎగ్జిక్యూటివ్ ఆధిపత్యాన్ని ప్రతిష్టించే ప్రయత్నానికి బదులు అందులో పారదర్శకతకు చోటిచ్చి, పరిశీలనలో ఉన్నవారి గుణదో షాలపై విస్తృత చర్చకు వీలు కల్పిస్తే మెరుగైన ఫలితాలు వచ్చేందుకు అవకాశాలుంటాయి.