ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకం, బదిలీలలో కీలక పాత్ర పోషించే కొలీజియం సమావేశానికి సైద్ధాంతికపరమైన నిర్ణయంతో గైర్హాజరైన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ చలమేశ్వర్‌కు మద్దతు పెరుగుతోంది. చలమేశ్వర్ నిర్ణయానికి ఇప్పటికే ముగ్గురు మాజీ సీజేలు మద్దతుతెలుపగా ఆదివారం సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ సామాజిక మాధ్యమంలో అభినందించారు. ‘హ్యాట్స్‌ఆఫ్ టు జస్టిస్ చలమేశ్వర్ ఫర్ హిజ్ ప్రిన్సిపుల్డ్ స్టాండ్’ అని జస్టిస్ కట్జూ ట్వీట్ చేశారు.