న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న నిబంధనను పక్కనపెట్టాలని.. అది లోపభూయిష్ట విధానంగా ఇప్పటికే రుజువైందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు. ‘విదర్ ఇండియన్ జ్యుడీషియరీ’ పేరుతో రాసిన పుస్తకంలో ఆయన పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ‘సుప్రీం కోర్టులోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి నిజాయితీపరుడైనా.. అతను అంత సామర్థ్యమున్న వ్యక్తి కాకపోవచ్చు. అప్పుడు అతన్ని పక్కనపెట్టి సీనియారిటీలో తరువాతి స్థానంలో ఉన్న న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్‌గా నియమించాలి’ అని మార్కండేయ కట్జూ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment