Justice Markandey Katju
-
సీజేఐ నియామకంలో మార్పులు అవసరం: కట్జూ
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న నిబంధనను పక్కనపెట్టాలని.. అది లోపభూయిష్ట విధానంగా ఇప్పటికే రుజువైందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు. ‘విదర్ ఇండియన్ జ్యుడీషియరీ’ పేరుతో రాసిన పుస్తకంలో ఆయన పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ‘సుప్రీం కోర్టులోని సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి నిజాయితీపరుడైనా.. అతను అంత సామర్థ్యమున్న వ్యక్తి కాకపోవచ్చు. అప్పుడు అతన్ని పక్కనపెట్టి సీనియారిటీలో తరువాతి స్థానంలో ఉన్న న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్‌గా నియమించాలి’ అని మార్కండేయ కట్జూ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. -
కర్ణన్‌తో పాటు మరికొందరు
వివాదాలకు కేంద్రంగా పలువురు న్యాయమూర్తుల వ్యాఖ్యలు న్యూఢిల్లీ: భారతదేశ న్యాయవ్యవస్థలో జస్టిస్ కర్ణన్ ఒక వివాదాస్పద అధ్యాయం.. జైలు శిక్ష ఎదుర్కొన్న తొలి న్యాయమూర్తిగా, అజ్ఞాతంలో ఉండి పదవీ విమరణ చేసిన న్యాయమూర్తిగా దేశ న్యాయచరిత్రలో నిలిచిపోయారు. కర్ణనే కాకుండాగతంలోనూ పలువురు న్యాయమూర్తులు తమ తీర్పుల సందర్భంగా వివాదా స్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలున్నాయి. వాటిని ఒకసారి పరిశీలిస్తే.. రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న మహేశ్ చంద్ర శర్మ పదవీ విరమణకు ముందు ఈ ఏడాది మే 31న ఒక తీర్పు సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెమలి బ్రహ్మచారి కావడం వల్లే జాతీయపక్షిగా ప్రకటించారని, ఆవు కూడా అంతే పవిత్రమని అందువల్ల జాతీయ జంతువుగా చేయాలని కోరారు. ‘మగ నెమలి బ్రహ్మచారిగా ఉంటుంది. ఆడ నెమలితో శృంగారం జరపదు. మగ నెమలి కన్నీళ్లు తాగడం ద్వారా ఆడ నెమలి గర్భం దాలుస్తుంద’న్న వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. జస్టిస్ జ్ఞాన సుధా మిశ్రా: న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటన సందర్భంగా సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ సుధా మిశ్రా సుప్రీం వెబ్సైట్లో ఆస్తుల వివరాలు పేర్కొంటూ.. వివాహం కాని తన కుమార్తెల్ని అప్పుగా ప్రస్తావించారు. జస్టిస్ భక్తవత్సల: 2012లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో వేధింపులకు పాల్పడుతున్న భర్త నుంచి విడాకులు కోరిన మహిళతో.. ‘పెళ్లి చేసుకుని అందరూ మహిళలు బాధలుపడుతున్నారు. నీకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు.. అంటే మహిళగా నీవు ఇబ్బంది పడుతున్నావని అర్థం. నీ భర్త మంచి వ్యాపారం చేస్తున్నాడు. అతను నీ బాగోగులు చూస్తాడు. అలాంటప్పుడు అతను కొడుతున్నాడనే విషయం గురించే ఎందుకు మాట్లాడుతున్నావ’ని పేర్కొన్నారు. జస్టిస్ మార్కండేయ కట్జూ: పదవిలో ఉండగా ఒక తీర్పు సందర్భంగా ‘కొందరు అవినీతిపరుల్ని బహిరంగంగా ఉరితీస్తే.. మిగతావారు అవినీతికి పాల్పడకుండా ఉంటార’ని వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. మరో కేసులో ‘ముస్లిం విద్యార్థుల్ని గడ్డం పెంచుకునేందుకు అనుమతిస్తే.. దేశం తాలిబన్ల ప్రాంతంగా తయారవుతుంద’ని పేర్కొన్నారు. జస్టిస్ శ్రీవాత్సవ : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ శ్రీవాత్సవ భగవద్గీతను జాతీయ ధర్మశాస్త్రంగా ప్రకటించాలని కోరడం విమర్శలకు దారితీసింది. జస్టిస్ పి.దేవదాస్: 2015లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో.. అత్యాచారం కేసులో నేరస్తుడితో రాజీ చేసుకోమని బాధితురాలికి సూచించడం ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. నేరస్తుడికి బెయిల్ మంజూరు చేయడంతో పాటు, అతన్ని పెళ్లి చేసుకోవాలని బాధితురాలికి జస్టిస్ దేవదాస్ సూచించారు. జస్టిస్ జేబీ పర్దివాలా: గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ‘ఈ దేశాన్ని నాశనం చేస్తున్న రెండు అంశాలు ఏవంటే.. ఒకటి రిజర్వేషన్, రెండు అవినీత’ని పేర్కొనడం చర్చనీయాంశమైంది. -
జైలుపక్షి చేతిలో కీలుబొమ్మ సీఎం అయ్యారు
చెన్నై: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పేరొందిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే చీఫ్ శశికళను జైలుపక్షిగా సంబోధిస్తూ.. ఆమె చేతిలో కీలుబొమ్మగా పళనిస్వామిని అభివర్ణించారు. తమిళులు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా అంగీకరించడాన్ని తప్పుపడుతూ, ఇది అవమానకరమని అన్నారు. కట్జూ తమిళులను ఉద్దేశిస్తూ రాసిన బహిరంగ లేఖను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. 'జైలుపక్షికి కీలుబొమ్మ తమిళనాడు సీఎం అయ్యారు. మీరు ఈ విషయంలో ఏం చేయలేకపోయారు. మీరు మహావీరులైన చోళులు, పాండ్యుల సంతతికి చెందినవారు. తిరువళ్లువర్, ఇళంగో, కంబార్, అండాల్, సుబ్రహ్మణ్య భారతి వారసులు. మీ పూర్వీకులు మిమ్మల్ని చూసి సిగ్గుపడే పరిస్థితి రాకూడదు. నేను తమిళుడని చెప్పేందుకు గర్వంగా భావిస్తాను. ఇప్పుడు ఈ ముఖంతో ఎలా చెప్పగలను? ముఖ్యమంత్రిగా పళనిస్వామి కొనసాగడం తమిళులకు కళంకం. ఆయన పదవిలో ఉంటే నేను తమిళుడిగా ఉండలేను. అవమానంతో, అగౌరవంతో బతకరాదు. దీనికంటే చావడం మేలు' అని కట్జూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. -
సుప్రీం కోర్టుకు కట్జూ క్షమాపణ
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టుపై చేసిన ధిక్కార వ్యాఖ్యలకు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తన బ్లాగులో బేషరతుగా క్షమాపణ తెలిపారు. దీనికి ఆమోదించిన సర్వోన్నత న్యాయస్థానం కట్జూపై కేసు విచారణను ఆపివేయాలని నిర్ణయించింది. శుక్రవారం న్యాయమూర్తులు రంజన్ గోగోయ్, యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టుకు కట్జూ క్షమాపణలు చెప్పినందున, దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆయనపై నమోదైన కోర్టు ధిక్కార కేసును తక్షణం మూసివేసిందని సీనియర్ న్యాయవాది రాజీవ్ దవన్ చెప్పారు. కట్జూ తరఫున ఆయన కోర్టుకు హాజరయ్యారు. కాగా వ్యక్తిగత హాజరు నుంచి కట్జూకు కోర్టు గతంలో మినహాయింపు ఇచ్చింది. -
నిజమే.. నా బుర్రలో ఏమీలేదు: మెగాస్టార్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బుర్రలో ఏమీలేదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు చేసిన వ్యాఖ్యలపై బిగ్ బీ హుందాగా స్పందించారు. ఆయన (కట్జు) చెప్పింది నిజమే.. నా బుర్రలోపల ఏమీ లేదు.. నా బుర్ర ఖాళీ అయిపోయింది.. అని అమితాబ్ అన్నారు. సుప్రీం కోర్టు తీర్పులపై సహా పలు సామాజిక అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేసే కట్జు ట్విట్టర్ వేదికగా ఈ సారి అమితాబ్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశారు. చాలా మంది జర్నలిస్టులు అమితాబ్‌ను ప్రశంసిస్తారని, అయితే ఆయన బుర్రలో ఏమైనా ఉందా అని తనకు సందేహంగా ఉందని కట్జు ట్వీట్ చేశారు. కాగా పింక్ సినిమాలో అమితాబ్ నటనను ఆయన ప్రశంసించారు. సినిమాల్లో గంభీరమైన డైలాగులతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసే అమితాబ్ నిజజీవితంలోనూ పలు అంశాలపై హుందాగా కామెంట్లు చేస్తుంటారు. కట్జు విషయంలో అమితాబ్ ఇలానే స్పందించారు. కట్జు, తాను ఒకే స్కూల్లో చదువుకున్నామని, ఆయన తనకంటే సీనియరని, తమ మధ్య ఎలాంటి విబేధాలూ లేవని మీడియా సమావేశంలో బిగ్ బీ చెప్పారు.