![నిజమే.. నా బుర్రలో ఏమీలేదు: మెగాస్టార్](/styles/webp/s3/article_images/2017/09/4/51474342200_625x300.jpg.webp?itok=hgTCqOZ8)
నిజమే.. నా బుర్రలో ఏమీలేదు: మెగాస్టార్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బుర్రలో ఏమీలేదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు చేసిన వ్యాఖ్యలపై బిగ్ బీ హుందాగా స్పందించారు. ఆయన (కట్జు) చెప్పింది నిజమే.. నా బుర్రలోపల ఏమీ లేదు.. నా బుర్ర ఖాళీ అయిపోయింది.. అని అమితాబ్ అన్నారు.
సుప్రీం కోర్టు తీర్పులపై సహా పలు సామాజిక అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేసే కట్జు ట్విట్టర్ వేదికగా ఈ సారి అమితాబ్ను ఉద్దేశించి పోస్ట్ చేశారు. చాలా మంది జర్నలిస్టులు అమితాబ్ను ప్రశంసిస్తారని, అయితే ఆయన బుర్రలో ఏమైనా ఉందా అని తనకు సందేహంగా ఉందని కట్జు ట్వీట్ చేశారు. కాగా పింక్ సినిమాలో అమితాబ్ నటనను ఆయన ప్రశంసించారు. సినిమాల్లో గంభీరమైన డైలాగులతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసే అమితాబ్ నిజజీవితంలోనూ పలు అంశాలపై హుందాగా కామెంట్లు చేస్తుంటారు. కట్జు విషయంలో అమితాబ్ ఇలానే స్పందించారు. కట్జు, తాను ఒకే స్కూల్లో చదువుకున్నామని, ఆయన తనకంటే సీనియరని, తమ మధ్య ఎలాంటి విబేధాలూ లేవని మీడియా సమావేశంలో బిగ్ బీ చెప్పారు.