న్యూఢిల్లీ: అఫ్జల్‌గురుకు అనుకూలంగా జేఎన్‌యూలో నిర్వహించిన సభలో విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ దేశ వ్యతిరేక నినాదాలు, రెచ్చగొట్టే ప్రసంగం చేసి ఉండకపోవచ్చనేది నిఘా సంస్థల అభిప్రాయం. ఢిల్లీ పోలీసుల అత్యుత్సాహంతో ఇచ్చిన నివేదిక వల్లే రాజద్రోహ నేరం మోపినట్లు అవి భావిస్తున్నాయి. అఫ్జల్‌గురుకు అనుకూలంగా నిర్వహించిన కార్యక్రమానికి కన్హయ్య హాజరైనా... రాజద్రోహం మోపాల్సినంత తప్పు చేసి ఉండకపోవచ్చని ఆ సంస్థలు హోం శాఖకు తెలిపాయి. సీపీఐ(మావోయిస్టు) అనుబంధ విభాగం డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్(డీఎస్‌యూ) విద్యార్థులు భారత్ వ్యతిరేక నినాదాలు చేశారని అధికారులు చెప్పినట్లు సమాచారం. కన్హయ్యకు సీపీఐ అనుబంధ ఎఐఎస్‌ఎఫ్ నేత అని, వారికి తీవ్ర భావజాలమున్న పార్టీతో సంబంధం ఉండదని, పోస్టర్లలో సభకు హాజరవ్వాలంటూ డీఎస్‌యు నేతల ఫొటోల్ని మాత్రమే ముద్రించారని నిఘా వర్గాలు హోంశాఖకు తెలిపాయి.
‘అతడు తప్పు చేశాడు!’
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో జరిగిన అఫ్జల్ కార్యక్రమంలో కన్హయ్య కుమార్ తప్పు చేశాడని.. ఈ వివాదంపై వర్సిటీ ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి విచారణ బృందం నిర్ధారించింది. ఆనాటి ప్రదర్శనలో కన్హయ్య పాత్ర నేరపూరితమైందని కమిటీ భావించింది.
కన్హయ్య ఆ నినాదాలు చేయలేదు!
Published Wed, Feb 17 2016 1:32 AM | Last Updated on Thu, Mar 28 2019 6:19 PM
Advertisement