ముంబై: ప్రముఖ హిందీ నటుడు రాజ్ కపూర్ స్థాపించిన ముంబైలోని ఆర్‌కే స్టూడియోను అమ్మేయాలని కపూర్ కుటుంబం నిర్ణయించింది. 1948లో నిర్మించిన ఈ స్టూడియోలో చాలా భాగం గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో దెబ్బతింది. మళ్లీ కొత్త నిర్మాణాలు చేపట్టడం ఆర్థికంగా సాధ్యం కాదని, అందుకే అమ్మేయాలని నిర్ణయించినట్లు రణ్‌ధీర్ కపూర్ తెలిపారు. ‘మేం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ఆర్‌కే స్టూడియోను అమ్మకానికి ఉంచాం’ అని ఆయన చెప్పారు. 1988లో రాజ్‌కపూర్ మరణం అనంతరం ఈ స్టూడియో బాధ్యతల్ని పెద్ద కుమారుడు రణధీర్ చూసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment