RK Studio
-
ఐకానిక్ స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్లు
సాక్షి, ముంబై: ముంబైలోని ఐకానిక్ ఆర్కె స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ (జీపీఎల్) గత ఏడాది కొనుగోలు చేసిన ఐకానిక్ ఆర్కే స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలను ప్రారంభించినట్టు శుక్రవారం తెలిపింది. 'కలెక్టర్ ఎడిషన్ రెసిడెన్సెస్' పేరుతో నిర్మిస్తున్న ఈ సముదాయంలో బొంబాయి ఆర్ట్ డెకో డిజైన్ తరహాలో ఆర్కిటెక్చర్, అత్యాధునిక, విలాసవంతమైనసౌకర్యాలు, అత్యంత కట్టుదిట్ట మైన సెక్యూరిటీ ఫీచర్లు ఈ ఫ్లాట్లలో కల్పించనున్నామని జీపీఎల్ ప్రకటించింది. ఈ మేరకు గోద్రెజ్ పాపర్టీస్ తన అధికారిక వెబ్సైట్లో వివరాలను పొందుపర్చింది. 3, 4 పడక గదుల లగ్జరీ ఫ్లాట్లకోసం ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించింది. 3 బెడ్ రూమ్ ఫ్లాట్ ధర రూ. 5.7 కోట్ల నుంచి, 4 బెడ్రూమ్ ఫ్లాట్ ధర రూ.10.9 కోట్ల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ వెబ్సైట్ తెలిపింది. చెంబూర్‌లోని ఐకానిక్ ఆర్కె స్టూడియోలో గోద్రేజ్ ఆర్కెఎస్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని గోద్రేజ్ ప్రాపర్టీస్ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోఝా గోద్రేజ్ ఒక ప్రకటనలో తెలిపారు. విశేషమైన వారసత్వాన్ని, అత్యుత్తమ జీవనశైలిని ఈ ప్రాంగణంలో నివసించబోయేవారికి అందించేలా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దుతామన్నారు. కాగా 72 సంవత్సరాల క్రితం, ప్రముఖ బాలీవుడ్ నటుటు రాజ్ కపూర్ ఆర్కే ఫిల్మ్ స్టూడియోను 2.2 ఎకరాల్లో స్థాపించారు. ఎన్నో భారీ చిత్రాలు ఈ స్టూడియోలోనే రూపుదిద్దుకున్నాయి. ఈ స్టూడియోను విక్రయించాలని నిర్ణయించుకున్న కపూర్ కుటుంబం గత ఏడాది జీపీఎల్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే. -
గోద్రేజ్ చేతికి ఆర్కే స్టూడియోస్
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత రాజ్ కపూర్‌కు చెందిన ఐకానిక్ ఆర్కే స్టూడియోస్‌ను గోద్రేజ్ సంస్థ చేజిక్కించుకుంది. ఈ స్టూడియోస్ ను హస్తగతం చేసుకోవడానికి చాలా సంస్థలు పోటీపడినా చివరకు.. గోద్రెజ్ సంస్థ గత ఏడాది అక్టోబర్‌లోనే రూ.190 కోట్ల రూపాయలకు చేజిక్కించుకుంది. అయితే శుక్రవారం దీనికి సంబంధించి లావాదేవీలన్నీ పూర్తయ్యాయి. ఆర్కే స్టూడియోస్‌ను తమ ఆస్తుల్లో భాగం చేసుకున్నందుకు ఆనందంగా ఉందంటూ గోద్రేజ్ తెలిపింది. దీనిపై గోద్రేజ్ ఎక్జిక్యూటివ్ చైర్మన్ ఫిరోజ్‌షా గోద్రేజ్ వ్యాఖ్యానిస్తూ చెంబూరు మౌలిక సదుపాయాల ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. మా వ్యూహాలకు ఈ స్థలం సరిగ్గా సరిపోతుంది. ఆర్కే స్టూడియోస్ ఎంతో ప్రాచుర్యం చెందింది. దీనికి ఎలాంటి చెడ్డపేరు రాకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు. 2017లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ స్టూడియోస్‌లో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. మరమ్మతులు చేయించాలనుకున్నప్పటికీ దీన్ని అమ్మకానికి పెట్టినట్లు స్టూడియోస్ యాజమాన్యం అనూహ్యంగా ప్రకటించింది. స్టూడియోస్‌ను ముంబయిలోని చెంబూరులో 2.2ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.జరుపుకొన్నాయి. కాగా సుమారు 70 సంవత్సరాల క్రితం ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో 2.2 ఎకరాల్లో నిర్మితమైన ఆర్కే స్టూడియోస్ ను బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్ కపూర్ ఈ స్టుడియోస్ ను నిర్మించారు. 1970, 80ల నాటి కాలంలో ఎన్నో చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. ఆర్కు ఫిలింస్ బ్యానర్లో ఆవారా, మేరా నామ్ జోకర్, శ్రీ 420 వంటి సినిమాలు నిర్మితమయ్యాయి. రాజ్ కపూర్ మరణించిన తరువాత ఈ స్టూడియోస్ ను ఆయనకుటుంబం దీని బాగోగులు చూస్తూ వచ్చింది. అయితే దీనిని అమ్మేయాలని రిషి కపూర్ ఫ్యామిలీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
‘నా ఆరోగ్యంపై ఊహాగానాలు వద్దు’
ముంబై : అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం అమెరికా వెళుతున్నట్టు బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ తన అభిమానులు, మిత్రులకు సమాచారం అందించారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. వైద్య చికిత్స నిమిత్తం అమెరికాకు వెళుతూ పనికి కొద్దిరోజులు విరామం ఇస్తున్నానని, తన ఆరోగ్యంపై అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని, ఎలాంటి వదంతులూ ప్రచారం చేయవద్దని కోరారు. అభిమానుల ప్రేమ, ఆశీస్సులతో 45 సంవత్సరాల పాటు తన సినీప్రయాణం సాగిందని, మీ అందరి దీవెనలతో తాను త్వరలోనే తిరిగివస్తానని ట్వీట్లో పేర్కొన్నారు. తమ కుటుంబానికి చెందిన ఆర్కే స్టూడియోస్‌లో ఇటీవల జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో రిషీకపూర్ తన కుమారుడు, సోదరులతో కలిసి కనిపించారు. గత ఏడాది ఆర్కే స్టూడియోస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడం కలకలం రేపింది. పునురుద్ధరణ భారీ వ్యయప్రయాసలతో కూడినది కావడంతో సుప్రసిద్ధ ఆర్కే స్టూడియోస్‌ను కపూర్ కుటుంబ సభ్యులు అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. -
అమ్మకానికి ఆర్కేస్టూడియో
-
ఆ స్టూడియోలో ఆడుకుంటూ పెరిగాం..
సాక్షి, ముంబై : చిత్ర, వినోద పరిశ్రమకు చిరునామాగా వర్థిల్లిన చారిత్రక ఆర్కే స్టూడియోను విక్రయించాలని కపూర్ కుటుంబం నిర్ణయించింది. గత ఏడాది అగ్నిప్రమాదంతో దెబ్బతిన్న స్టూడియో పునరుద్ధరణకు భారీ వ్యయం వెచ్చించడంతో పాటు లాభసాటి కాదన్న అభిప్రాయంతో బాధాకరమైనా ఈ నిర్ణయం తీసుకున్నామని రిషీ కపూర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆర్కే స్టూడియోను అమ్మేయాలనే కపూర్ కుటుంబ నిర్ణయంపై బాలీవుడ్ భామ, కపూర్ కుటుంబానికి చెందిన కరీనా కపూర్ స్పందించారు. తమ తాత రాజ్ కపూర్ నిర్మించిన ఈ స్టూడియోతో తమకు ఎన్నో జ్ఞాపకాలు పెనవేసుకున్నాయని చెప్పుకొచ్చారు. తమ కుటుంబ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామంటూ స్టూడియో కారిడార్లలో షికార్లు కొడుతూ తాము పెరిగామని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తమ తండ్రి, వారి సోదరులు ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. 1948లో 70 ఏళ్ల కిందట ఈ స్టూడియోను రాజ్ కపూర్ నిర్మించారు. -
అమ్మకానికి ఆర్కే స్టూడియో
ముంబై: ప్రముఖ హిందీ నటుడు రాజ్ కపూర్ స్థాపించిన ముంబైలోని ఆర్కే స్టూడియోను అమ్మేయాలని కపూర్ కుటుంబం నిర్ణయించింది. 1948లో నిర్మించిన ఈ స్టూడియోలో చాలా భాగం గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో దెబ్బతింది. మళ్లీ కొత్త నిర్మాణాలు చేపట్టడం ఆర్థికంగా సాధ్యం కాదని, అందుకే అమ్మేయాలని నిర్ణయించినట్లు రణ్‌ధీర్ కపూర్ తెలిపారు. ‘మేం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ఆర్కే స్టూడియోను అమ్మకానికి ఉంచాం’ అని ఆయన చెప్పారు. 1988లో రాజ్‌కపూర్ మరణం అనంతరం ఈ స్టూడియో బాధ్యతల్ని పెద్ద కుమారుడు రణధీర్ చూసుకుంటున్నారు. -
ఫిల్మ్ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం
-
ఆర్కే స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం
ముంబై : ముంబైలోని ప్రఖ్యాత ఆర్కే స్టూడియోలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో డెకరేషన్ సామగ్రికి అంటుకొని భారీగా మంటలు వ్యాపించాయి. 6 ఫైరింజన్లు, 5 వాటర్ ట్యాంకర్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. 'సూపర్ డ్యాన్సర్' టీవీ షో సెట్లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం కావడంతో సిబ్బందితో పాటూ షోకు సంబంధించిన సభ్యులు ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది.