
సాక్షి, ముంబై : చిత్ర, వినోద పరిశ్రమకు చిరునామాగా వర్థిల్లిన చారిత్రక ఆర్‌కే స్టూడియోను విక్రయించాలని కపూర్ కుటుంబం నిర్ణయించింది. గత ఏడాది అగ్నిప్రమాదంతో దెబ్బతిన్న స్టూడియో పునరుద్ధరణకు భారీ వ్యయం వెచ్చించడంతో పాటు లాభసాటి కాదన్న అభిప్రాయంతో బాధాకరమైనా ఈ నిర్ణయం తీసుకున్నామని రిషీ కపూర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఆర్‌కే స్టూడియోను అమ్మేయాలనే కపూర్ కుటుంబ నిర్ణయంపై బాలీవుడ్ భామ, కపూర్ కుటుంబానికి చెందిన కరీనా కపూర్ స్పందించారు. తమ తాత రాజ్ కపూర్ నిర్మించిన ఈ స్టూడియోతో తమకు ఎన్నో జ్ఞాపకాలు పెనవేసుకున్నాయని చెప్పుకొచ్చారు. తమ కుటుంబ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామంటూ స్టూడియో కారిడార్లలో షికార్లు కొడుతూ తాము పెరిగామని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తమ తండ్రి, వారి సోదరులు ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. 1948లో 70 ఏళ్ల కిందట ఈ స్టూడియోను రాజ్ కపూర్ నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment