
కర్ణాటకలో ఐఏఎస్ అధికారి ఆత్మహత్య
బెంగళూరు: కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్ అధికారి డీకే రవి(35) సోమవారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని మరణించారు. వాణిజ్య పన్నుల(ఎన్‌ఫోర్స్‌మెంట్) విభాగంలో ఈయన అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఉదయం కార్యాలయం నుంచి ఇంటికి తిరిగి వచ్చి ప్రాణాలు తీసుకున్నారని, ప్రాథమికంగా దీన్ని ఆత్మహత్యగానే పరిగణిస్తున్నట్లు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు. రవి ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు. కర్ణాటక కేడర్ 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయినా రవి.. కోలార్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకొని ప్రజల మన్నలు పొందారు. గత అక్టోబర్‌లోనే వాణిజ్య పన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.